తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Covid 19 r value: మళ్లీ పెరిగిన ఆర్​-ఫ్యాక్టర్.. థర్డ్​వేవ్​ తప్పదా? - ఆర్​- ఫ్యాక్టర్​ పెరుగుదల

దేశంలో మరోసారి ఆర్​-ఫ్యాక్టర్​ (covid 19 r value) పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆగస్టు నెలఖరుకు ఈ ఆర్-​ ఫ్యాక్టర్​ సంఖ్య 1.17కు పెరిగినట్లు పరిశోధకులు వెల్లడించారు.

r factor increase
Covid 19 r value: మళ్లీ పెరిగిన ఆర్​-ఫ్యాక్టర్.. థర్డ్​వేవ్​ తప్పదా!

By

Published : Sep 3, 2021, 8:48 PM IST

కరోనా వ్యాప్తిని సూచించే ఆర్​- ఫ్యాక్టర్​ మరోసారి పెరిగినట్లు పరిశోధకలు హెచ్చరించారు. ఆగస్టు 14-17 తేదీల మధ్య 0.89గా ఉన్న ఆర్​-ఫ్యాక్టర్​.. నెలఖరుకు 1.17కు పెరిగిందని తెలిపారు. ప్రధానంగా.. కేరళ, మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా కేసులు ఆర్​-ఫ్యాక్టర్ (covid 19 r value)​ మీద ప్రభావం చూపించాయని పేర్కొన్నారు.

" ఆగస్టు నెలాఖరుకు పరిస్థితి ఆందోళకరంగా మారింది. ఆర్​-ఫ్యాక్టర్​ 1.2కి చేరువలోకి వచ్చింది. ఇదివరకు థర్డ్​వేవ్​ హెచ్చరికలు జారీ చేసినప్పుడు ఈ సంఖ్య 1.03గా ఉంది. కేరళ, మహారాష్ట్ర, మిజోరం, జమ్ముకశ్మీర్​లలో కరోనా వ్యాప్తి ఆర్​-ఫ్యాక్టర్​ పెరుగుదలపై ప్రభావం చూపిస్తోంది."

-సితాభ్ర సిన్హా, పరిశోధకులు

కేరళ సహా మరో నాలుగు రాష్ట్రాల్లో ఆర్​-ఫ్యాక్టర్​ సంఖ్య ఆందోళకర స్థాయిలో ఉంది. కేరళలో 1.33, మిజోరంలో 1.36, జమ్ముకశ్మీర్​ 1.25, మహారాష్ట్ర 1.06 సహా ఆంధ్రప్రదేశ్​లో 1.09గా ఆర్​-ఫ్యాక్టర్​ నమోదైంది.

దేశంలో మార్చి నుంచి మే నెల మధ్య ఆర్-​ ఫ్యాక్టర్​ అత్యధిక సంఖ్య నమోదైంది. మార్చి 9 నుంచి ఏప్రిల్​ 21 మధ్య ఈ సంఖ్య 1.37గా ఉంది.

ఇదీ చదవండి :covid variant mu: భారత్​లో 'మ్యూ' భయాలు- కొత్త వైరస్​ ప్రమాదకరమా?

ABOUT THE AUTHOR

...view details