తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డబ్బు ఆశతో క్షుద్రపూజలు, భార్యకు అందరిముందు నగ్నంగా స్నానం చేయించి - husband made wife naked for aghori puja

వ్యాపారంలో లాభాలు వస్తాయన్న ఆశతో అందరిముందు నగ్నంగా స్నానం చేయాలని భార్యపై ఒత్తిడి చేశాడు ఓ వ్యక్తి. అత్తమామలు సైతం ఒత్తిడి చేయడం వల్ల భర్త చెప్పినట్టే చేసింది ఆ మహిళ. మరోవైపు, గర్భిణీ అని చూడకుండా మహిళ కడుపులో తన్నారు అధికార పార్టీ కార్యకర్తలు.

police station
police station

By

Published : Aug 22, 2022, 6:14 PM IST

భార్య మాన ప్రాణాలను కాపాడేందుకు ఏమైనా చేసే భర్తలను చూసుంటాం. కానీ ఇక్కడ మాత్రం తన స్వార్థం కోసం కట్టుకున్న భార్యను అందరి ముందర నగ్నంగా నిల్చోబెట్టాడు ఓ ప్రబుద్ధుడు. మహారాష్ట్ర పుణెలో జరిగిన ఈ ఘటనతో ఆ ప్రాంతా వాసులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.

వివరాల్లోకి వెళ్తే..
వ్యాపారంలో లాభాలు చేరుకుని ఇంట సుఖశాంతులు నెలకొనాలంటే అఘోరీ పూజ చేయాలని ఎవరో చెప్పారని ఈ దుర్మాగానికి ఒడిగట్టాడు ఆ వ్యక్తి. దీనికి అతని తల్లిదండ్రులు సైతం సహకరించారు. దీంతో అతని ఆగడాలు మితిమీరిపోయాయి. ఏకంగా భార్యను అందరి ముందు నగ్నంగా స్నానం చేయాలని బలవంతం చేశాడు. భర్త ఒత్తిడికి తలొగ్గిన నిస్సహాయురాలైన భార్య.. చెప్పినట్టు ఆ పని చేసింది. చుట్టూ ఉన్నవారు సైతం దీన్ని చూస్తూ నివ్వెరపోయారే తప్ప ఎవరూ ఆ భర్తను ప్రశ్నించే ధైర్యం చేయలేదు.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇందులో భాగస్వాములైన అతని తల్లిదండ్రులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. కాగా ఈ ఉదంతానికి సహకరించిన మాంత్రికుడు మాత్రం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

గర్భిణీని కడుపులో తన్ని..
కోల్​కతాలోని నార్కేల్​డంగా ప్రాంతానికి చెందిన తృణముల్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే, కౌన్సిలర్​ అనుచరులు ఒక గర్భిణీని అతి క్రూరంగా కడుపులో తన్నారు. ఈ ఘటనపై పోలీసులు సైతం నోరు మెదపకపోవడం వల్ల బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే: నార్కేల్​డంగాకు చెందిన శివ్​ శంకర్​ దాస్​, అతని కుమారుడు దీపక్​ దాస్​ ఆ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు. విషయం తెలుసుకున్న తృణముల్​ కాంగ్రెస్​ కౌన్సిలర్​ స్వపన్​ సమద్దర్​.. వారిద్దరిని ఆదివారం తనను కలవమన్నాడు. దానికి వారు నిరాకరించడం వల్ల సాయంత్రం ఎమ్మెల్యే పరేష్​ పాల్​, కౌన్సిలర్​ అనుచరులు శివ్​ శంకర్​ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. తండ్రీ కొడుకులిద్దరిని ఘోరంగా చితకబాదారు. అంతేకాకుండా గర్భిణీగా ఉన్న దీపక్​ భార్యను సైతం విడిచిపెట్టలేదు. ఆమెను అతి దారుణంగా కడుపులో తన్ని గాయపరిచారని బాధితులు ఆరోపించారు.

బాధితురాలిని హుటాహుటిగా కోల్​కతా వైద్య కళాశాలకు తరలించారు. కడుపులో ఉన్న బిడ్డకు ఎటువంటి ప్రమాదం జరగలేదని వైద్యులు తెలిపారు. ఈ విషయం గురించి తనకు అసలు తెలియదని, తనకు దీనికి ఎటువంటి సంబంధం లేదని ఎమ్మెల్యే పరేష్​ పాల్​ చెప్పుకొచ్చారు. బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం టీఎంసీ అనుచరులు దాడులు జరుపుతున్న సమయంలో వారు పోలీసులను ఆశ్రయించారని, కానీ పోలీసులు ఈ విషయంపై స్పందించకపోగా.. తమనే అరెస్ట్​ చేస్తామని బెదిరించారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోల్​కతా పోలీసులు మాత్రం ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

కూలీ డబ్బుల కోసం వెళ్తే క్రూరంగా కొట్టి..
మహారాష్ట్రలోని సోలాపుర్​ మధా తాలుకుకు చెందిన ఓ కాంట్రాక్టర్ అతని వద్ద పని చేస్తున్న ఇద్దరు కార్మికులను అతి దారుణంగా కొట్టాడు. ఈ ఘటన భూతష్టే గ్రామంలో జరిగింది. ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది. అందులో కార్మికులిద్దరి కాళ్లు, చేతులను కట్టేసి మరి కొడతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. బాధితుల్లో ఒకరి భార్య మాధా పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా నిండితులైన బాలాజీ మోరే, అనంత్​ యాదవ్​తో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడ్డ కార్మికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వికాశ్​ బివా నాయక్​వాదీ, సేవక్​ కస్బే గత కొంత కాలంగా బాలాజీ మోరే వద్ద పని చేస్తున్నారు. ఆగస్ట్​ 15న వికాశ్​ కాంట్రాక్టర్​ దగ్గర నుంచి కూలీ డబ్బులు తెస్తానని తన భార్యకు చెప్పి వెళ్లాడు. రాత్రైనా అతను రాలేదని ఆమె ఆందోళన చెందింది. మరుసటి రోజు ఉదయం సందీప్​ లోవేటే అనే వ్యక్తి వికాస్ ఇంటికి వచ్చి అతని భార్యకు ఆ వీడియోను చూపించాడు. పోలీసులను ఆశ్రయించిన నేపథ్యంలో.. కార్మికులను అతి క్రూరంగా కొట్టినవారిపై అట్రాసిటీ కేసును నమోదు చేశారు.

ఇదీ చదవండి:

రాంగ్ రూట్​లో వచ్చి స్కూల్​ వ్యాన్​ను ఢీకొట్టిన లారీ, నలుగురు విద్యార్థులు మృతి

14 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం, తీవ్రంగా కొట్టి, రోడ్డుపై వదిలేసి

ABOUT THE AUTHOR

...view details