ఓ కుక్క యజమాని పట్ల తన ప్రేమను చాటుకుంది. ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న యజమానిని కిందకు దింపేందుకు దాదాపు 4 గంటలపాటు శ్రమించింది. ఆ సమయంలో స్థానికులు సహా పోలీసులను ఇంట్లోకి రానివ్వలేదు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్.. ఝాన్సీలో అదివారం రాత్రి జరిగింది.
ఇదీ కథ..
ఝాన్సీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంచవటి పాష్ కాలనీలోని సంభవ్ అగ్నిహోత్రి(23) అనే యువకుడు తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతడు సివిల్స్ పరీక్షల కోసం సన్నద్ధమయ్యేవాడు. సంభవ్ తండ్రి ఆనంద్ అగ్నిహోత్రి రైల్వే శాఖలో విధులు నిర్వర్తిస్తున్నాడు. సంభవ్ తల్లి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెను చికిత్స కోసం సంభవ్ తండ్రి ఆనంద్.. భోపాల్‌కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఇంట్లో సంభవ్, అతడి పెంపుడు కుక్క అలెక్స్ మాత్రమే ఇంట్లో ఉన్నారు.
ఆనంద్ అగ్నిహోత్రి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతని కుమారుడు సంభవ్ లిఫ్ట్ చెయ్యలేదు. దీంతో కంగారు పడిన అతడు ఇరుగుపొరుగు వారికి ఫోన్ చేసి కొడుకు గురించి ఆరా తీశాడు. ఇరుగుపొరుగు వారు సంభవ్ ఇంటికి చేరుకోగా.. వారిపై పెంపుడు అలెక్స్ దాడి చేసింది. అప్పటికే సంభవ్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులను సంభవ్ పెంపుడు కుక్క అలెక్స్ ఇంట్లోకి రానివ్వలేదు. ఓ పోలీస్ అధికారిపై దాడి కూడా చేసింది. దీంతో వారు శునకానికి మత్తుమందు ఇచ్చి వలలో బంధించారు. అనంతరం సంభవ్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే సంభవ్ పెంపుడు కుక్క కూడా కాసేపటికే మరణించడం గమనార్హం. కుక్కకు అధిక మోతాదులో మత్తు మందు ఇవ్వడం వల్లే మరణించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కుమారుడి మరణవార్త విన్న సంభవ్ తండ్రి ఆనంద్ శోకసంద్రంలో మునిగిపోయారు. భోపాల్‌లో ఉన్న తన భార్యను తీసుకుని ఆదివారం అర్ధరాత్రికి ఝాన్సీ చేరుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సంభవ్ది హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
నా మేనల్లుడు సంభవ్ అగ్నిహోత్రి గత 5 ఏళ్లుగా జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన శునకాన్ని పెంచుకుంటున్నాడు. ఆ కుక్కకు అలెక్స్ అని పేరు పెట్టాడు. సంభవ్ అగ్నిహోత్రికి అలెక్స్ అంటే చాలా ఇష్టం. సంభవ్ మృతదేహాన్ని కిందకు తీసేందుకు శునకం గంటల తరబడి ప్రయత్నించింది. అందుకే సంభవ్ దుస్తులు, కాళ్ల పాదాలపై కుక్క పంటి గాట్లు కనిపించాయి.
-- అభిషేక్ మిశ్రా, సంభవ్ మేనమామ
సంభవ్ పెంచుకున్న కుక్క అలెక్స్ ఇవీ చదవండి: