మాదకద్రవ్య రహిత భారతాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ను సమాజం నుంచి తరిమికొట్టేందుకు కృషి చేస్తున్న వారిని ప్రశంసించారు. వారి కృషి.. ఎంతో మంది ప్రాణాలను రక్షించేందుకు ఉపయోగపడుతుందన్నారు. డ్రగ్స్‌తో మానవాళి చీకటి మయం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల జీవితాలు దెబ్బతింటాయని ట్వీట్ చేశారు మోదీ.
"నేడు(జూన్ 26) అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం. ఈ సందర్భంగా సమాజం నుంచి డ్రగ్స్‌ను నిర్మూలించేందుకు కృషి చేస్తున్న వారికి నా ప్రశంసలు. వారి ప్రయత్నాలు ప్రజల ప్రాణాలను కాపాడతాయి. డ్రగ్స్ కారణంగా మానవాళి చీకట్లోకి వెళ్తోంది. ప్రజల జీవితాలు దెబ్బతింటున్నాయి."
--ప్రధాని నరేంద్ర మోదీ