పెళ్లయిన తర్వాత ఎనిమిదేళ్ల వరకూ పిల్లలు కలగక, ఇక కలగరని ఆశలు వదులుకున్న దంపతులు.. అవధుల్లేని ఆనందానికి లోనయ్యారు! సుదీర్ఘ నిరీక్షణ ఫలించి, ఒకేసారి వారికి నలుగురు సంతానం కలిగారు. వీరిలో ఒకరు అమ్మాయి కాగా, మిగతా ముగ్గురు అబ్బాయిలు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు చెందిన దంపతులు.. సంతానం కోసం ఎందరో వైద్యులను సంప్రదించారు. ఐసీయూ వంటి సాంకేతికతల సాయంతో వైద్యం పొందారు. ఎనిమిదేళ్లు గడిచినా ఫలితం లేకపోయింది. చివరిగా వారు దిల్లీలోని 'సీడ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్' ఆసుపత్రి డైరెక్టర్ డా.గౌరి అగర్వాల్‌ను సంప్రదించారు. అన్ని వైద్య నివేదికలను పరీక్షించి, ఐవీఎఫ్ ద్వారా సంతానం కలిగే అవకాశముందని ఆమె సూచించారు. ఈ విధానంలో వైద్యం అందించడం ద్వారా.. గృహిణిగా ఉంటున్న ఆ మహిళ(32) గర్భం దాల్చారు.