Jawan Suicide: రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో విషాదం జరిగింది. ఉన్నతాధికారులు సెలవు మంజూరు చేయలేదని మనస్తాపం చెందిన ఓ జవాన్.. గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు.. జవాన్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ జరిగింది.. జోధ్‌పుర్‌లోని సీఆర్పీఎఫ్ శిక్షణా కేంద్రం క్యార్టర్స్‌లోని నాలుగో అంతస్తులో నివాసం ఉంటున్న జవాన్ నరేశ్.. ఆదివారం సెలవు కావాలని ఉన్నతాధికారులను శనివారం అడిగాడు. కొన్ని కారణాల వల్ల అధికారులు సెలవు మంజూరు చేయలేదు. దీంతో నరేశ్ మనస్తాపం చెందాడు. కోపోద్రిక్తుడైన అతడు తన సహద్యోగి చేయిని కొరికాడు. ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ కూడా జరిగింది. ఆ తర్వాత అతడ్ని శాంతింపజేయడానికి పలువురు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.
ఆత్మహత్య చేసుకున్న జవాన్ నరేశ్ అనంతరం ఇంటి లోపలికి వెళ్లిన నరేశ్.. తాళం వేసుకొని తన కుటుంబసభ్యులతో కలిసి బందీ చేసుకున్నాడు. ఆదివారం సాయంత్రం తన బాల్కనీలో నిల్చున్న నరేశ్.. తన దగ్గర ఉన్న సర్వీస్ పిస్టల్‌తో గాలిలో ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపాడు. ఎవరైనా దగ్గరికి వస్తే చంపేస్తానని బెదిరించాడు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు.. నరేశ్‌తో ఫోన్లో మాట్లాడినా అతడు శాంతించలేదు. సుమారు 18 గంటలు ఇంట్లోనే బందీలా గడిపిన జవాన్.. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు.. జవాన్ ఇంటికి వెళ్లి గన్ను స్వాధీనం చేసుకున్నారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.
ఇవీ చదవండి:యువ వైద్యురాలు అనుమానాస్పద మృతి.. చేతికి ఇంజెక్షన్!
వామ్మో.. అది ఆటోనా? లేక బస్సా?.. ఏకంగా 27 మందితో ఫుల్ స్పీడ్‌గా