తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్ని చిత్రహింసలు పెట్టినా అక్కడే! అతడిపై 'ప్రేమ'కు బలైపోయిన శ్రద్ధ! - అఫ్తాబ్​ పూనావాలా శ్రద్ధా వాకర్​

దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసిన శ్రద్ధ హత్య కేసులో మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అఫ్తాబ్​పై మితిమీరిన ప్రేమ ఆమెను బలితీసుకుందనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

SHRADDHA  murder case
SHRADDHA murder case

By

Published : Nov 18, 2022, 4:44 PM IST

శ్రద్ధా వాకర్ హత్యకేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దర్యాప్తు కొనసాగుతుండడం వల్ల కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య కేసులో ఆధారాల సేకరణ దర్యాప్తు అధికారులకు క్లిష్టంగా మారింది. 35 శరీర భాగాల్లో ఇప్పటికే 13 వరుకు దొరికాయి. వాటికి డీఎన్​ఏ పరీక్ష నిర్వహించి అవి శ్రద్ధావో కాదో తేల్చాలి. ఇక మిగతా భాగాలు కనిపిస్తే తెలియజేయండంటూ.. పోలీసు ఉన్నతాధికారులు వివిధ పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ క్రమంలో తాగాజా మరో విషయం బయటపడింది. నిందితుడు అఫ్తాబ్​ తరచూ శ్రద్ధపై తీవ్రంగా దాడి చేసేవాడని తెలిసింది. దాంతో ఓరోజు నలసొపరిలో ఉన్న ఓజోన్​ ఆస్పత్రికి తీవ్ర గాయాలతో శ్రద్ధ వచ్చిందని ఆమెకు చికిత్స అందించిన డాక్టర్​ ఎస్పీ శిందే తెలిపారు. ఆస్పత్రికి వచ్చే సమయంలో శ్రద్ధ నడవలేదని స్థితిలో ఉందని.. ఆమె మెడ, భుజాలపై తీవ్రమైన గాయాలున్నాయని చెప్పారు. ఇంత జరిగినా.. అప్తాబ్​తో కలిసుండాలని శ్రద్ధ అనుకుందని తెలుస్తోంది. ఫొటోల్లో కూడా ఆమె ముఖంపై గాయాలు కనబడుతున్నాయి. ఇంకా శరీరమంతా గాయాలున్నాయని తెలుస్తోంది.

ముఖం మీద గాయాలతో శ్రద్ధ

తల్లిదండ్రులు చెప్పినా వినలేదు..
తల్లిదండ్రులను కాదని.. ప్రేమికుడి కోసం దిల్లీ వచ్చేసింది శ్రద్ధ. సహజీవనం విషయాల గురించి తల్లితో పంచుకునేది. అఫ్తాబ్​ పెట్టిన చిత్రహింసల గురించి కూడా శ్రద్ధ తన తల్లితో చెప్పుకునేదని.. దాంతో అఫ్తాబ్​ను వదిలి వచ్చేయమని తల్లి బతిమాలేదని పోలీస్​ విచారణలో వెల్లడైంది. జనవరిలో తల్లి మరణం తర్వాత.. అఫ్తాబ్​ విషయంపై తండ్రి వారించినా.. శ్రద్ధ వినిపించుకోలేదు. అఫ్తాబ్​తోనే కలిసి జీవించేందుకు పట్టుపట్టింది. అయినా ఆమె జీవితం అఫ్తాబ్​తో సాఫీగా సాగలేదు. శ్రద్ధతో అఫ్తాబ్​ తరచూ గొడవపడేవాడు. అఫ్తాబ్​ చిత్రహింసలు భరించుకుంటూ.. అతడితోనే సహజీవనం కొనసాగించింది. చివరకు హత్యకు గురైంది.

అధారాల సేకరణే అసలు సవాలు..
అఫ్తాబ్​ అరెస్టు అనంతరం శ్రద్ధాను చంపి 35 భాగాలుగా కోసి.. వివిధ ప్రాంతాల్లో విసిరేశానని నిందితుడు ఒప్పుకున్నాడు. ఇంకా మరికొన్ని వివరాల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. అయితే హత్య జరిగి దాదాపు 6 నెలలు గడిచిపోవడం వల్ల.. అధారాల సేకరణ క్లిష్టంగా మారింది. ఇప్పటికే దాదాపు పది శరీర భాగాలు లభించగా.. అవి శ్రద్ధావో కాదో తెలియాల్సి ఉంది. ఫోరెన్సిక్​ నివేదికలు వచ్చిన తర్వాత ఆ విషయం తెలుస్తుంది. ఇంకా తల, ఇతర భాగాలు దొరకాలి. ఇక మెహ్​రౌలీ ప్రాంతానికి సమీపంలోనే ఉన్న త్రిలోక్​పురిలో జూన్​లో గుర్తుతెలియని శరీరభాగాలు దొరికాయి.

దిల్లీలోని పాండవ్​నగర్​లో కూడా కుళ్లిపోయిన తల భాగం లభ్యమైంది. ఇది శ్రద్ధదేనా కాదా అనే విషయం ఫోరెన్సిక్​ పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాత తెలుస్తుంది. అయితే ఈ కేసులో నిందితుడు కూడా సరైన వివరాలు చెప్పడం లేదు. హత్య అనంతరం శ్రద్ధ తలను ఎవరూ గుర్తు పట్టకుండా కాల్చేశానని చెప్పాడు. దీంతో నిందితుడు చెప్పేది నిజమా లేక తమను తప్పుదోవ పట్టిస్తున్నాడా అని తెలుసుకునేందుకు నార్కో అనాలసిస్​ పరీక్షలు కూడా చేయబోతున్నారు పోలీసులు. అందుకోసం నిందితుడిని ఐదు రోజుల పోలీస్​ కస్టడీ కూడా తీసుకున్నారు.

ఇవీ చదవండి :హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

లాడ్జిలో వంట గదిలాంటి సెటప్.. సీక్రెట్ డోర్ ఓపెన్ చేస్తే అమ్మాయిలతో..

ABOUT THE AUTHOR

...view details