African Swine Fever: భారత్‌లో మరో కొత్త వ్యాధి కలకలం రేపింది. కేరళ వాయనాడ్ జిల్లా మనంతవాడి వద్ద రెండు పందుల పెంపక కేంద్రాల్లో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్‌కు శాంపిల్స్‌ను పంపగా.. పందులకు ఈ వ్యాధి సోకినట్లు నిర్ధరణ అయిందని అధికారులు తెలిపారు.
''ఒకే ఫాంలోని పందులు ఎక్కువగా చనిపోవడం వల్ల శాంపిళ్లను పరీక్షల నిమిత్తం భోపాల్ ల్యాబ్‌కు పంపాం. ఆఫ్రికన్ స్వైన్ వ్యాధి నిర్ధరణ అయింది. వ్యాధి వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఫాంలోని 300 పందులను చంపాలని ఆదేశాలు ఇచ్చాం.
- పశు సంవర్ధకశాఖ అదికారులు
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి. ఈ వ్యాధి పందులకు సోకడం వల్ల అవి మరణిస్తాయి. పందుల నుంచి మనుషులకు సోకే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధికి ఇప్పటివరకు టీకా అందుబాటులోకి రాలేదు. అంతకుముందు కేరళలోనే కొన్ని రోజుల క్రితం మంకీపాక్స్ కేసు వెలుగుచూసింది. అలాగే కొవిడ్, స్వైన్‌ప్లూ వంటి వ్యాధులు కూడా కేరళలోనే తొలుత వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది.
చదవండి:భారత రాష్ట్రపతుల ప్రత్యేకతలేంటో తెలుసా?
కోడలిపై అత్తమామల చిత్రహింసలు.. కత్తితో పొడిచి.. ప్రైవేట్ పార్టుల్లో కర్రను పెట్టి..