తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మరో కొత్త వ్యాధి- 4,832 పందులు మృతి - మిజోరం స్వైన్ ఫీవర్ న్యూస్

మిజోరంలో స్వైన్​ ఫీవర్ కారణంగా 40 రోజుల వ్యవధిలో 4,832 పందులు మరణించాయి. ఎనిమిది జిల్లాల్లో ఈ కేసులు బయటపడ్డాయి. దిగుమతి చేసుకున్న పందుల వల్ల స్వైన్ ఫీవర్ వ్యాపించి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.

swine fever mizoram
ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ మిజోరం

By

Published : Jun 1, 2021, 1:54 PM IST

మిజోరంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కలకలం రేగింది. పందుల్లో ఈ వ్యాధి ఆందోళనకర స్థాయిలో వ్యాపిస్తోంది. మార్చి 21 నుంచి మే 31 మధ్య మిజోరంలో 4,832 పందులు స్వైన్ ఫీవర్ బారిన పడి మరణించాయని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ వెల్లడించింది. మే 31న ఒక్కరోజే 81 మందులు చనిపోయాయని తెలిపింది.

ఇప్పటివరకు మిజోరంలోని ఎనిమిది జిల్లాల్లో స్వైన్​ ఫీవర్ కేసులు బయటపడ్డాయి. లంగ్​సెన్ జిల్లాలో మార్చి 25న తొలి కేసు గుర్తించారు. అనంతరం అన్ని జిల్లాల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను మోహరించారు. లంగ్​సెన్​ను ఇన్​ఫెక్టెడ్ జోన్​గా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్రకటించింది. ఆ జిల్లాలోని 26 గ్రామాల్లో ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రాంతాల్లో మొత్తం 31,108 పందులు ఉన్నాయి.

కారణం అదే!

ఇన్​ఫెక్టెడ్ జోన్ వెలుపల 100 పందులు అనుమానాస్పద రీతిలో మరణించినట్లు తెలిసిందని ప్రభుత్వం వెల్లడించింది. పక్క రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న పందుల వల్ల స్వైన్ ఫీవర్ వ్యాపించి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

టీకా లేదు

ఆఫ్రికన్ స్వైన్​ ఫీవర్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. దీని ద్వారా పందులు అధిక సంఖ్యలో మరణిస్తున్నాయి. ఈ వ్యాధి పందుల నుంచి మనుషులకు సోకే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధికి ఇప్పటివరకు టీకా అందుబాటులోకి రాలేదు.

ఇదీ చదవండి-Bird Flu: ప్రపంచంలో తొలిసారి మనిషికి...

ABOUT THE AUTHOR

...view details