తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నాగ్​పుర్​లో మాయమై.. తాలిబన్లతో కలిసి ప్రత్యక్షమై.. - అఫ్గానిస్థాన్

భారత్​లో పదేళ్ల పాటు అక్రమంగా నివసించిన ఓ వ్యక్తి అనూహ్యంగా అఫ్గానిస్థాన్​లోని తాలిబన్లతో కలిసి ప్రత్యక్షమయ్యాడు. ఇంతకీ ఎవరు అతను? అసలు భారత్​లో ఎందుకున్నాడు?

taliban
తాలిబన్​

By

Published : Aug 20, 2021, 5:26 PM IST

Updated : Aug 22, 2021, 6:44 AM IST

మహారాష్ట్ర నాగ్​పుర్​లో అక్రమంగా నివసిస్తున్న ఓ వ్యక్తిని దేశం నుంచి బహిష్కరించగా.. అతడు అఫ్గానిస్థాన్​లో తాలిబన్లతో కలిసి ప్రత్యక్షమయ్యాడు. తుపాకీ పట్టుకొని ఉన్న అతడి ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ వ్యక్తిని నూర్​ మహ్మద్ అజీజ్ మహ్మద్​గా పోలీసులు గుర్తించారు.

"నూర్ మహ్మద్ గడిచిన 10ఏళ్లు నాగ్​పుర్​లోని దిఘోరీలో అక్రమంగా నివసిస్తూ ఉన్నాడు. నిఘా వర్గాల సమాచారం మేరకు అతడిని అదుపులోకి తీసుకొని, ఈ ఏడాది జూన్​ 23న అఫ్గానిస్థాన్​ పంపించేశాం. అనంతరం అతడు తాలిబన్లలో కలిసిపోయి ఉంటాడు." అని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.

శరణార్థిగా ఉండిపోవాలని ప్రయత్నం!

2010లో 6 నెలల పర్యటక వీసాపై అతడు నాగ్​పుర్​కు వచ్చాడని అంతకుముందు దర్యాప్తులో తేలినట్లు అధికారి తెలిపారు. "అనంతరం శరణార్థిగా గుర్తించాలని అతడు చేసిన దరఖాస్తును, అప్పీలును ఐరాస మానవ హక్కుల మండలి నిరాకరించింది. అప్పటి నుంచి అక్రమంగా నాగ్​పుర్​లోనే ఉన్నాడు" అని వెల్లడించారు.

సోదరుడూ తాలిబనే?

నూర్​ అసలు పేరు అబ్దుల్​ హకీ అని, అతడి సోదరుడు తాలిబన్లతో కలిసి పనిచేస్తున్నట్లు మరో అధికారి తెలిపారు. కాగా, అదుపులోకి తీసుకన్న సమయంలో నూర్ ఎడమ భుజంలో బుల్లెట్ గాయాలను గుర్తించారు పోలీసులు. సామాజిక మాధ్యమాల్లో పలువురు ఉగ్రవాదులను అతడు అనుసరించినట్లు తెలిపారు.

ఇదీ చూడండి:తాలిబన్ల అకృత్యాలతో భయం భయంగా అఫ్గాన్​ ప్రజలు!

Last Updated : Aug 22, 2021, 6:44 AM IST

ABOUT THE AUTHOR

...view details