అఫ్గాన్ అమ్మాయి, ఫ్రాన్స్ అబ్బాయిని భారత రాజ్యాంగం కలిపింది. సొంతదేశం వెళ్లేందుకు ఎదురైన సమస్యలను పరిష్కరించింది. వారి కథ సుఖాంతం అయ్యేందుకు దోహదం చేసింది.
అసలేమైందంటే..
వేరు వేరు పనుల మీద భారత్‌కు వచ్చిన ఈ ఇద్దరు విదేశీయులు.. ఇక్కడే ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, భరతమాత సాక్షిగా ఒక్కటైన ఈ జంట తిరిగి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒకరి దేశంలో తాలిబన్ సమస్యతో అఫ్గాన్ ప్రజలు స్పేచ్ఛగా ఊపిరి పీల్చుకునే అవకాశం లేదు. దీంతో వారిరువురు ఫ్రాన్స్‌కు వెళ్లి జీవించాలని అనుకున్నారు. అయితే ఆ దేశానికి వెళ్లేందుకు యువతికి వీసా లేదు.
వివాహాన్ని చట్టబద్ధంగా నమోదు చేయిస్తేనే వీసా జారీ చేస్తామని ఫ్రాన్స్ ఎంబసీ స్పష్టం చేసింది. వివాహాన్ని రిజిస్టర్ చేయించాలంటే ఆధార్, లేదా ఇతర గుర్తింపు కార్డులు అవసరం. ఇద్దరూ విదేశీయులే కావడం వల్ల.. స్థానిక గుర్తింపు కార్డులేవీ వీరి వద్ద లేవు.
కానీ, సమస్య పరిష్కారానికి భారత రాజ్యాంగం, దేశంలోని కొన్ని ప్రత్యేక చట్టాలు దోహదం చేశాయి. వీరి కథ సుఖాంతం అవ్వడానికి ఓ లాయర్ సహకరించారు. యువతీయువకుల తరఫున దిల్లీ హైకోర్టును ఆశ్రయించి కేసును మలుపుతిప్పారు. ఆయనే దివ్యాంశు పాండే.