ADR Report on Rajya Sabha Members :ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా రాజ్యసభకు ఎన్నికైన సిట్టింగ్ ఎంపీల్లో 12 శాతం మంది బిలియనీర్లు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ADR) వెల్లడించింది. ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ (NEW) అనే సంస్థతో కలిసి 225 మంది (మొత్తం 233 మంది సభ్యులు) రాజ్యసభ సభ్యులపై ఉన్న నేరాలు, ఆస్తుల వివరాలతో నివేదికను విడుదల చేసింది. అలాగే ఏపీ, తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యులే ఎక్కువ ఆదాయాన్ని కలిగి ఉన్నారని ఏడీఆర్ నివేదికలో పేర్కొంది.
100 కోట్లకు పైగా ఆస్తులున్న రాజ్యసభ సభ్యుల సంఖ్య..
- ఏపీ నుంచి మొత్తం 11 మంది రాజ్యసభ సభ్యులు ఉండగా.. అందులో ఐదుగురు(45 శాతం)కి రూ. 100 కోట్లకు పైగా ఆస్తులున్నాయి.
- తెలంగాణ నుంచి మొత్తం ఏడుగురు సభ్యులు ఉండగా.. వారిలో ముగ్గురు(43 శాతం)కి రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్నాయి.
- మహారాష్ట్రలోకు చెందిన 19 మందిలో రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు(16 శాతం)కి రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్నాయి.
- దిల్లీ నుంచి ప్రాతినిథ్య వహిస్తున్న ముగ్గురిలో సభ్యుల్లో ఒకరికి (33 శాతం) రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్నాయి.
- పంజాబ్ 7 మంది ఎంపీల్లో ఇద్దరు ఎంపీలకు(29 శాతం) రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్నాయి.
- హరియాణాకు చెందిన ఐదుగురు ఎంపీల్లో ఒకరికి(20 శాతం) రూ.100కోట్లకు పైగా ఆస్తులున్నాయి.
- మధ్యప్రదేశ్ పదికొండు మంది ఎంపీల్లో 2 ఇద్దరు(18) రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్నాయి.
- ప్రస్తుత రాజ్యసభలో ఒక సీటు ఖాళీగా ఉంది.
తెలంగాణకు చెందిన ఏడుగురి రాజ్యసభ సభ్యుల ఆస్తుల విలువ రూ.5,596 కోట్లుగా ఉందని ADR-NEW నివేదిక ద్వారా వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 11 మంది రాజ్యసభ సభ్యుల ఆస్తుల విలువ రూ.3,823 కోట్లని తేలింది. ఉత్తర్‌ప్రదేశ్(30) రాజ్యసభ సభ్యుల ఆస్తుల విలువ రూ.1,941 కోట్లని తమ ఉమ్మడి నివేదికలో ఈ సంస్థలు వెల్లడించాయి.