తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తమిళనాడు ఎమ్మెల్యేల నేరచరితపై ఏడీఆర్​ నివేదిక

తమిళనాడులో సిట్టింగ్​ ఎమ్మెల్యేల నేరచరితపై ఏడీఆర్​ కీలక వివరాలు వెల్లడించింది. 204 మందిలో 68 మంది ఎమ్మెల్యేలు తమ క్రిమినల్ కేసుల వివరాలు ప్రకటించారని పేర్కొంది. డీఎంకేకు చెందిన 40 మంది, అన్నాడీఎంకేకు చెందిన 23 మంది ఎమ్మెల్యేలకు నేరచరిత ఉన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది.

adr
తమిళనాడు ఎమ్మెల్యేల నేరచరితపై ఏడీఆర్​ నివేదిక

By

Published : Mar 10, 2021, 10:56 PM IST

తమిళనాడులో 204 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 68 మంది తమపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలు ప్రకటించారని ప్రజాస్వామ్య సంస్కరణల సమూహం (ఏడీఆర్​) ఓ నివేదికలో తెలిపింది. మొత్తం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో వీరి సంఖ్య 33 శాతం ఉంటుందన్న ఏడీఆర్ వీరిలో 19 శాతం లేదా 38 మందిపై తీవ్రమైన నేరాలు ఉన్నట్లు వివరించింది.

ఈ కేసులు నిరూపితమైతే 5 ఏళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. డీఎంకేకు చెందిన 40 మంది, అన్నాడీఎంకేకు చెందిన 23 మంది ఎమ్మెల్యేలకు నేరచరిత ఉన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది. మొత్తం సభ్యుల్లో దాదాపు 77 శాతం లేదా 157 మంది ఎమ్మెల్యేలు కోట్ల రూపాయల్లో ఆస్తులు కలిగి ఉన్నారని పేర్కొంది. 5 నుంచి 12 తరగతుల మధ్య చదువుకున్నవారు 89 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక తెలిపింది.

ఇదీ చదవండి :ఎన్నికలకు ఉదయనిధి స్టాలిన్​ దూరం?

ABOUT THE AUTHOR

...view details