తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుజరాత్​ బరిలో కోటీశ్వరులు.. ఇద్దరు అభ్యర్థుల సంపద రూ.వెయ్యికోట్ల పైనే! - గుజరాత్ ఎన్నికల ఫలితాలు

ADR Report Gujarat : గుజరాత్​ శాసనసభ సమరం చివరి అంకానికి చేరుకుంది. డిసెంబర్​ 1న తొలి దశ జరగనుండగా.. డిసెంబర్​ 5న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే రెండో దశలో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంపద వివరాలను అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రైట్స్ పరిశీలించగా ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

ADR Report Gujarat
ADR Report Gujarat

By

Published : Nov 29, 2022, 5:56 PM IST

ADR Report Gujarat : డిసెంబర్​ 5న జరగనున్న గుజరాత్​ శాసనసభ ఎన్నికల రెండో దశలో పోటీచేసే అభ్యర్థుల్లో అత్యధిక భాగం కోటీశ్వరులే ఉన్నారు. అన్ని ప్రధాన పార్టీలు సంపన్నులనే తమ అభ్యర్థులుగా నిలబెట్టాయి. అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్​ రైట్స్​ ప్రచురించిన నివేదికలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. కేవలం ఇద్దరు భాజపా అభ్యర్థుల ఆస్తులే రూ. వెయ్యి కోట్లకు మించాయని నివేదిక స్పష్టం చేసింది. గాంధీనగర్​ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జయంతి భాయ్​ సోమాభాయ్​ పటేల్​ ఆస్తి రూ.661 కోట్లు కాగా.. సిధ్​పుర్​ నుంచి పోటీ చేస్తున్న బల్వంత్​ సిన్హ్​ రాజ్​పుత్​ ఆస్తి రూ. 343 కోట్లుగా ఉంది. దీంతో రాష్ట్రంలోనే అత్యధిక సంపద కలిగిన అభ్యర్థిగా నిలిచారు జయంతి భాయ్​ సోమాభాయ్ పటేల్​. ఐదుగురు భాజపా అభ్యర్థులు ఆస్తులను కలిపితే సుమారు రూ.1200 కోట్లకు మించిందని నివేదిక పేర్కొంది. విజాపుర్​ అభ్యర్థి.. రమణాభాయ్​ డీ పటేల్​ రూ.95 కోట్లు, దస్​క్రోయి అభ్యర్థి బాబుభాయ్​ జమ్నాదాస్​ పటేల్​ రూ.61 కోట్లు, ఆనంద్​ అభ్యర్థి యోగేశ్​ పటేల్​ రూ. 46 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

రెండో దశలో భాజపా అభ్యర్థులుగా ప్రకటించిన 93 మందిలో 75 మంది అభ్యర్థులు కోటీశ్వరులేనని ఏడీఆర్​ నివేదిక వెల్లడించింది. సరాసరిగా పరిశీలిస్తే ఈ విషయంలో భాజపా కంటే కాంగ్రెస్ కాస్త ముందజలోనే ఉంది. భాజపాలో 81 శాతం కోటీశ్వరులు ఉండగా.. కాంగ్రెస్​లో 86 శాతం మంది ఉన్నారు. కాంగ్రెస్​ 90 మంది అభ్యర్థులను ప్రకటించగా.. వారిలో 77 మంది కోటీశ్వరులు ఉన్నారు. అభ్యర్థుల ఆస్తుల సగటును పరిశీలిస్తే ఒక్కో అభ్యర్థి సంపద రూ. 4.25 కోట్లుగా ఉంది. 2017లో జరిగిన ఎన్నికల్లో ఈ సగటు రూ. 2.39 కోట్లుగా ఉంది. పార్టీల వారీగా పరిశీలిస్తే భాజపా రూ. 19.58 కోట్లు, కాంగ్రెస్ రూ. 7.61 కోట్లు, ఆమ్​ఆద్మీ పార్టీ రూ. 5.28 కోట్లతో తర్వాత స్థానాల్లో ఉంది.

ఐదుగురు అభ్యర్థులు మాత్రం తమకేమీ ఆస్తులు లేవని అఫిడవిట్​ సమర్పించారు. సున్నా ఆస్తులు ఉన్నాయని అఫిడవిట్​ సమర్పించిన వారిలో గాంధీనగర్​ నార్త్​ అభ్యర్థి పత్ని మహేంద్రభాయ్​ సోమాభాయ్​ పటేల్, నరోడా అభ్యర్థి పటేల్​ సత్యకుమార్​, అమరైవాడీ అభ్యర్థి సతీశ్​ హీరాలాల్​ సోనీ, దానిమిల్దా అభ్యర్థి కస్తూర్భాయ్ రంఛోద్​భాయ్​, సబర్మతీ అభ్యర్థి జీవన్​భాయ్​ రామాభాయ్​ ఉన్నారు.

విద్యార్హత అంతంతే..
రెండో దశలో పోటీచేస్తున్న 833 మంది అభ్యర్థుల్లో సగానికి పైగా మంది కనీసం 12 తరగతి కంటే తక్కువ చదివినవారే ఉన్నారు. అభ్యర్థుల విద్యార్హతలపై ఏడీఆర్​ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 833 మందిలో 505 అభ్యర్థుల విద్యార్హత ఐదో తరగతి నుంచి 12 తరగతి మధ్యే ఉంది. వీరిలో 61 మంది ఐదో తరగతి పాస్​కాగా.. 116 మంది 8 తరగతి, 162 మంది 10 తరగతి, 166 మంది 12 తరగతి ఉత్తీర్ణత సాధించారు. మరో 27 మంది డిప్లొమా, 70 మంది పీజీ, 10 మంది గౌరవ డాక్టరేట్ పొందిన వారున్నారు. మరోవైపు 32 మంది తమకు కనీసం చదవడం, రాయడం మాత్రమే వస్తోందని చెప్పగా.. ఐదుగురు అభ్యర్థులు తాము నిరాక్షరాస్యులమని అఫిడవిట్​లో పొందుపరిచారు.

25-40 వయసు గల అభ్యర్థులు 284 మంది ఉండగా.. 41-60 మధ్య వయస్కులు 430 మంది, 61-80 వయసు గల వారు 118 ఉన్నారు. ఈ దశలో మొత్తం 833 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా వీరిలో మహిళలు కేవలం 69 మందే ఉన్నారు. భాజపా 8, కాంగ్రెస్​ 7, ఆప్​ నుంచి ఒకరు పోటీలో ఉండగా.. 21 మంది స్వతంత్రులుగా బరిలో ఉన్నారు.

ఇవీ చదవండి:'జాతీయాంశంగా 'ఉమ్మడి పౌరస్మృతి'.. త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో అమలు'

విభిన్నంగా సాగుతున్న గుజరాత్​ ప్రచారం.. 'ఆప్'​ను ప్రత్యర్థిగా లెక్కచేయని భాజపా, కాంగ్రెస్​!

ABOUT THE AUTHOR

...view details