తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పిల్లలను మార్చుకున్న అన్నదమ్ములు.. తమ్ముడి కుమార్తె అన్నకు దత్తత.. పెద్దోడి కుమారుడు చిన్నోడికి! - మహారాష్ట్ర లేటెస్ట్ న్యూస్

మహారాష్ట్రకు చెందిన ఇద్దరు సోదరులు ఒకరి పట్ల మరొకరు ప్రేమను చాటుకున్నారు. అన్న కుమారుడిని తమ్ముడు దత్తత తీసుకున్నాడు. తమ్ముడి రెండు నెలల కుమార్తెను అన్న దత్తత తీసుకున్నాడు. చిన్నారికి పేరు పెట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి ఔరా అనిపించారు.

Adopted girl by give boy
మహారాష్ట్రకు చెందిన సోదరులు

By

Published : Feb 14, 2023, 7:09 PM IST

Updated : Feb 14, 2023, 7:30 PM IST

మహారాష్ట్ర సాంగ్లీలో అరుదైన ఘటన జరిగింది. ఇద్దరు అన్నాదమ్ములు తమ సంతానాన్ని పరస్పరం దత్తత ఇచ్చుకున్నారు. తన తమ్ముడికి ఇద్దరు కూతుర్లు ఉన్నారని ఓ కుమార్తెను దత్తత తీసుకున్నాడు అన్న. అలాగే అన్నకు ఇద్దరు కుమారులు ఉన్నారని ఓ కుమారుడిని దత్తత తీసుకున్నాడు తమ్ముడు. దీంతో ఇద్దరు సోదరులకు ఇప్పుడు ఒక పాప, బాబు ఉన్నారు. అలాగే బాలికకు పేరు పెట్టే కార్యక్రమాన్ని షెగాల్ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. బంధువులకు, గ్రామస్థులకు భోజనాలు పెట్టారు.

షెగాల్​ గ్రామానికి చెందిన బిరుదేవ్​ మానే, అప్పాసో మానే ఇద్దరు అన్నదమ్ములు. వీరిద్దరిలో బిరుదేవ్ మానే పెద్దవాడు. ఇద్దరు సోదరులు తమ తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నారు. బిరుదేవ్​కు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. రెండేళ్ల కిందట మరో కుమారుడు జన్మించాడు. అలాగే అప్పాసోకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. రెండు నెలల క్రితం మరో కుమార్తె పుట్టింది. దీంతో సోదరులిద్దరూ ఒకరి పిల్లలను మరొకరు దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. బిరుదేవ్ చిన్న కుమారుడు ఆరుశ్​ను అప్పాసో దత్తత తీసుకున్నాడు. అప్పాసో రెండు నెలల కుమార్తెను బిరుదేవ్ దత్తతగా తీసుకున్నాడు. చిన్నారికి అన్విత అని పేరు పెట్టారు. బిరుదేవ్​ మానే, అప్పాసో మానే తీసుకున్న నిర్ణయం పట్ల కుటుంబీకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

చిన్నారులతో బిరుదేవ్ మానే సోదరులు
చిన్నారి అన్విత
Last Updated : Feb 14, 2023, 7:30 PM IST

ABOUT THE AUTHOR

...view details