తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ లీక్ అయిందా..? క్లారిటీ ఇచ్చిన సీపీ - TSPSC question paper leak case

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ ఘటనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లీక్ విషయంపై అదనపు సీపీ విక్రమ్ సింగ్ వివరణ ఇచ్చారు. తమ దృష్టికి రాలేదని విక్రమ్‌సింగ్‌ తెలిపారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లీక్‌పై ఎలాంటి ఫిర్యాదు రాలేదని స్పష్టం చేశారు.

tspsc exam paper leak case
tspsc exam paper leak case

By

Published : Mar 14, 2023, 3:51 PM IST

Updated : Mar 14, 2023, 4:24 PM IST

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ పరీక్షా పత్రాల లీక్‌ వ్యవహారంలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ లీకేజీపై అదనపు సీపీ విక్రమ్ సింగ్ వివరణ ఇచ్చారు. టీఎస్‌పీఎస్సీ ఏఈ పేపర్ లీక్ కేసు దర్యాప్తు జరుగుతోందని విక్రమ్‌సింగ్‌ పేర్కొన్నారు. ప్రవీణ్‌తో పాటు 9 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అయితే గ్రూప్ 1 పేపర్ లీకేజీ విషయం తమ దృష్టికి రాలేదని విక్రమ్‌సింగ్‌ తెలిపారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లీక్‌పై ఎలాంటి ఫిర్యాదు రాలేదని స్పష్టం చేశారు. వివిధ కోణాల్లో లీకేజీ కేసు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

''మాకు ఉన్న సమాచారం ప్రకారం గ్రూప్ 1 పేపర్ లీక్ అయిన విషయం ఇంకా స్పష్టత లేదు. అలాంటిది మా దృష్టికి రాలేదు. కేసు దర్యాప్తులో ఉంది. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాము. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లీక్ అయిందని ఎలంటి ఫిర్యాదు అందలేదు. కేవలం మాకు ఉన్న సమాచారం ప్రకారం టీఎస్‌పీఎస్సీ ఏఈ పేపర్ లీక్ అయింది. కేసు దర్యాప్తులో ఉంది. ప్రవీణ్‌తో పాటు 9 మంది అరెస్ట్ చేసాము.'' - విక్రమ్ సింగ్, నగర శాంతి భద్రతల అదనపు సీపీ

ఇక ఇదిలా ఉంటే టీఎస్‌పీఎస్‌సీ వద్ద విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీ నేతలు ధర్నాకు దిగారు. ఈ ఆందోళనలో టీఎస్‌పీఎస్సీ బోర్డు ధ్వంసం అయింది. దీనితో రంగంలోకి పోలీసులు దిగారు. టీఎస్‌పీఎస్సీ వద్ద భద్రతను అదనపు సీపీ విక్రమ్‌సింగ్‌ పర్యవేక్షించారు. టీఎస్‌పీఎస్సీ వద్ద అదనపు బలగాలు మోహరించారు. వరుస ఆందోళనల దృష్ట్యా అదనపు బలగాలు మోహరించినట్లు తెలుస్తోంది. 9 మంది నిందితులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్య పరీక్షల తర్వాత పోలీసులు నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ పరీక్షా పత్రాల లీక్‌ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్‌ గ్రూప్ 1 కూడా రాయడంతో అనుమానాలు తలెత్తాయి. అతనికి 150 మార్కులకు 103 మార్కులు వచ్చాయి. అయినప్పటికీ ప్రవీణ్ అర్హత సాధించలేదు. బుక్‌ లెట్ నంబర్ కింద మార్కింగ్ తప్పుగా చేయడంతో... ప్రవీణ్ అర్హత సాధించలేదు. ఇక ఈ ప్రవీణ్ ఫోన్‌లో ఏడుగురు మహిళల నగ్న చిత్రాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఫోన్​ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.

గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ లీక్ అయిందా..? క్లారిటీ ఇచ్చిన సీపీ

ఇవీ చూడండి..

TSPSC పేపర్‌ లీకేజీ కేసు.. ప్రవీణ్‌ ఫోన్‌లో మహిళల న్యూడ్ వీడియోలు

TSPSC లీకేజీ వ్యవహారం.. AE పేపర్ ఒక్కటే కాదు.. అవి కూడా లీక్?

Last Updated : Mar 14, 2023, 4:24 PM IST

ABOUT THE AUTHOR

...view details