తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీకి అధిర్​ రంజన్​ చౌదరి లేఖ! - మాల్దా, ముర్షీదాబాద్​

బంగాల్​లో కోతకు గురైన నదీతీర ప్రాంత సమస్యని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి లోక్​సభలో కాంగ్రెస్​ పక్షనేత అధిర్​ రంజన్​ చౌదరి లేఖ రాశారు. ప్రత్యేక ఉపశమన ప్యాకేజీని ప్రకటించాలని కోరారు.

Adhir
అధిర్​ రంజన్​ చౌదరి

By

Published : Jun 12, 2021, 5:52 PM IST

గంగానది వరదల వల్ల బంగాల్​ మాల్దా, ముర్షీదాబాద్​ జిల్లాల్లోని తీరప్రాంతాలు కోతకు గురయ్యాయని లోక్​సభలో కాంగ్రెస్​ పక్షనేత అధిర్​ రంజన్​ చౌదరి పేర్కొన్నారు. ఈ సమస్యపై జాతీయ విపత్తుగా ప్రకటించి తగినన్ని నిధుల్ని కేటాయించాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

ఈ రెండు జిల్లాల్లోని సారవంతమైన భూములు నది వరదల వల్ల కోసుకుపోయాయని లేఖలో పేర్కొన్నారు. దాంతో లక్షల్లో ప్రజలు నిరాశ్రయులయ్యారని..తద్వారా కొత్త వలస సంక్షోభం రాబోతోందని అన్నారు. వలసలు పెరిగితే సామాజిక సమస్యలు తలెత్తి.. నేరాలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇలా నదితీరప్రాంతాల కోతల వల్ల మాల్దా నుంచి గతంలో చాలా మంది ప్రజలు ముంబయిలోని బైకుల్లా ప్రాంతానికి వలస వచ్చారని గుర్తుచేశారు. గుర్తింపు పత్రాలన్ని వరదల కారణంగా పోగొట్టుకోవడం వల్ల వారిపై బంగ్లాదేశీయులైనే ముద్రవేస్తున్నారని తెలిపారు.

ఇదీ చదవండి:IMA: జూన్ 18న దేశవ్యాప్తంగా ఆందోళనలు

ABOUT THE AUTHOR

...view details