Adani security category : దిగ్గజ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి జెడ్ కేటగిరీ భద్రత కల్పించనుంది కేంద్రప్రభుత్వం. సీఆర్పీఎఫ్ కమాండోలు ఆయనకు ఇకపై రక్షణగా ఉండనున్నారు. అదానీకి ముప్పు ఉందంటూ కేంద్ర భద్రతా సంస్థలు ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అదానీ భద్రతను చూసుకోవాలని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)ను కేంద్ర హోంశాఖ కోరగా.. కమాండోలు ఇప్పటికే రంగంలోకి దిగినట్లు తెలిసింది. అయితే.. జెడ్ కేటగిరీ భద్రతకు అయ్యే ఖర్చంతా అదానీనే భరించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎక్కడికెళ్లినా ఆయనకు పటిష్ఠ భద్రత కల్పించేందుకు నెలకు రూ.15-20లక్షలు చెల్లించాలి.
మరో దిగ్గజ పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీకి 2013 నుంచి జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత కొన్నేళ్ల నుంచి ఆయన భార్య నీతా అంబానీకి కాస్త తక్కువ స్థాయి భద్రత కల్పిస్తోంది.