Adani Rahul Gandhi :గౌతమ్అదానీ గ్రూప్ అక్రమాలకు సంబంధించి పలు పత్రికల్లో కథనాలు వచ్చిన నేపథ్యంలో ఆ ఆరోపణలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. ఒక బిలియన్ డాలర్లు భారత్ నుంచి వెళ్లి వివిధ మార్గాల ద్వారా దేశంలోకి తిరిగి వచ్చినట్లు మీడియా కథనాలు వెలువడినట్లు చెప్పారు. విపక్ష కూటమి ఇండియా సమావేశాల్లో పాల్గొనేందుకు ముంబయి వెళ్లిన రాహుల్ గాంధీ.. అదానీ వ్యవహారంపై మీడియాతో మాట్లాడారు.
Rahul Gandhi On Adani : కృత్రిమంగా పెంచి, వచ్చిన సొమ్ముతో ఓడరేవులు, విమానాశ్రయాలు కొనుగోలు చేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ డబ్బు ఎవరిది.. అదానీదేనా.. ఇంకెవరిదైనా.. అని ఆయన ప్రశ్నించారు. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ, నాసర్ అలీ, ఛాంగ్ చుంగ్ లింగ్.. ఈ అక్రమాల వెనుక ఉన్నట్టు కథనాలు వచ్చాయన్నారు. గతంలో అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై క్లీన్‌చిట్ ఇచ్చిన సెబీ అధికారి.. ఇప్పుడు ఎన్డీటీవీలో డైరెక్టర్‌గా ఉన్నట్లు తెలిపారు. ఈ విషయాలన్నీ చూస్తే అదానీ గ్రూపులో ఏదో తప్పు జరుగుతోందని ఇట్టే అర్థమవుతోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.