5జీ వైర్లెస్ నెట్వర్క్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ దిల్లీ హైకోర్టును సోమవారం ఆశ్రయించారు బాలీవుడ్ నటి, పర్యావరణ కార్యకర్త జూహీ చావ్లా. ఆ సాంకేతికత వల్ల పౌరులు, వృక్ష, జంతుజాలంపై తీవ్ర రేడియేషన్ ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
"5జీ ఏర్పాటుకు టెలీకమ్యూనికేషన్ పరిశ్రమ ప్రయత్నాలు ఫలిస్తే.. భూమిపై ఉన్న ఏ ఒక్క జీవజాలం కూడా రేడియేషన్ బారి నుంచి తప్పించుకోలేదు. ఆర్ఎఫ్ రేడియేషన్ స్థాయి ఇప్పుడున్న దాని కన్నా 10 నుంచి 100 రెట్లు పెరుగుతుంది. పర్యావరణంపై కోలుకోలేని దెబ్బ పడుతుంది."
- జూహీ చావ్లా, పర్యావరణ కార్యకర్త