ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ మాజీ నేత ఊర్మిళ మతోండ్కర్ శివసేనలో చేరికకు ముహూర్తం ఖరారైంది. మంగళవారం ఆమె ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. కాంగ్రెస్‌ను వీడిన ఏడాది తర్వాత ఆమె శివసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.
గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ముంబయి నార్త్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన ఊర్మిళ ఓటమిపాలయ్యారు. అనంతరం ముంబయి కాంగ్రెస్ నేతల వ్యవహారశైలి నచ్చకపోవడంతో గతేడాది సెప్టెంబర్‌లో ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా చేశారు.