చెక్కు బౌన్స్ కేసులో శరత్‌కుమార్, రాధికకు ఏడాది జైలు - రేడియన్స్ మీడియో ప్రైవేట్ లిమిటెడ్
13:34 April 07
శరత్‌కుమార్, రాధికకు ఏడాది జైలుశిక్ష
తమిళ నటుడు శరత్ కుమార్, ఆయన భార్య నటి రాధికా శరత్‌కుమార్‌కు చెన్నై ప్రత్యేక న్యాయస్థానం ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. చెక్‌బౌన్స్ కేసులో ఈ శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.
తమపై ఉన్న రెండు చెక్ బౌన్స్ కేసుల్లో న్యాయవిచారణ రద్దు చేయాలని కోరుతూ 2019లో వీరు దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. నందనంలో సినిమా నిర్మాణాలకు రుణం అందించే రేడియన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి తేయ్నంపేట్కు చెందిన మేజిక్ ఫ్రేమ్స్ అనే సంస్థ భారీ మొత్తాన్ని రుణంగా తీసుకుంది. మేజిక్ ఫ్రేమ్స్ సంస్థలో నటుడు శరత్ కుమార్ ఆయన భార్య నటి రాధిక, లిస్టిన్ స్టీఫెన్ భాగస్వాములుగా ఉన్నారు.
అయితే.. అప్పు తిరిగి ఇచ్చేటప్పుడు.. తేదీలేని చెక్‌లను శరత్‌కుమార్ చెల్లించారు. కానీ, 2017 మార్చిలో ఆ చెక్కులు బౌన్స్ అయ్యాయి. దాంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది రేడియన్స్ మీడియా.