తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పర్స్​లు కొట్టేస్తూ అడ్డంగా దొరికిన నటి.. స్పాట్​లోనే అరెస్ట్ - రూపా దత్​ను అరెస్ట్​ చేసిన పోలీసులు

Serial Actor Arrest : ప్రముఖ సీరియల్​ నటి రూపా దత్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. కోల్​కతాలో జరుగుతున్న అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో ఆమె దొంగతనానికి పాల్పడడమే ఇందుకు కారణం.

Actor Rupa Dutta arrested
బుక్​ఫెయిర్​లో నటి దొంగతనం

By

Published : Mar 13, 2022, 5:30 PM IST

Serial Actor Arrest : కోల్​కతాలో జరుగుతున్న అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో దొంగతనం చేసినందుకు బంగాలీ నటి రూపా దత్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. చాకచక్యంగా బాధితుల దృష్టి మరల్చి వారి పర్సులను కొట్టేసినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇలా కొట్టేసిన ఓ పర్స్​ను ఆమె చెత్త కుండీలో వేయడం చూసిన ఉత్తర బిధాన్​నగర్​ పోలీసు అధికారి అమెను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విషయం బయట పడింది. పోలీసులు ప్రశ్నిస్తుండగా.. రూప చెప్పిన సమాధానాలతో వారికి సందేహం వచ్చింది. ఈ క్రమంలో ఆమె బ్యాగ్​ను చెక్​ చేయగా అందులో రూ. 75 వేల నగదుతో పాటు చాలా పర్స్​లు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

అయితే ఈ నేరంతో నటి రూపకు మాత్రమే సంబంధం ఉందా లేక దీని వెనుక ఎవరు అయినా ఉన్నారా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రూపా దత్​ బంగాలీలో కొన్ని సీరియల్స్​లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

ఇదీ చూడండి:పోలీసుల ఓవర్​ యాక్షన్​- రోడ్డుపై ఈడ్చి, బూటుకాలితో తన్ని..

ABOUT THE AUTHOR

...view details