ప్రముఖ తమిళ నటుడు కార్తిక్ అస్వస్థతకు గురైన కారణంగా శనివారం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. కొవిడ్ పరీక్షల్లో నెగెటివ్ వచ్చినా.. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.
నటుడు కార్తిక్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక - ఆస్పత్రిలో చేరిన కార్తిక్
నటుడు కార్తిక్ అస్వస్థతకు గురయ్యారు. భాజపా అభ్యర్థి, నటి ఖుష్బూ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తుండగా శ్వాసకోస సమస్యను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
నటుడు కార్తిక్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
నటి, భాజపా అభ్యర్థి ఖుష్బూకు మద్దతుగా ఆమె నియోజకవర్గమైన థౌజెండ్ లైట్స్‌లో ప్రచారం నిర్వహిస్తుండగా కార్తిక్‌కు శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా మారిందని సమాచారం. దీంతో హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి :ఉత్తరాఖండ్ సీఎం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు