కేరళలో ప్రముఖ సినీతార అమలా పాల్‌ను గుడిలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు ఆలయ సిబ్బంది. ఎర్నాకులంలో తిరువైరానికులంలోని ఓ ఆలయంలో ఈ ఘటన జరిగింది. దీంతో ఆమె చేసేది లేక గుడి బయటి నుంచే దేవుడిని మొక్కి వెనుదిరిగారు. దీనిపై హిందూ ఐక్య వేదిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమలాపాల్‌కు వారి మద్దతును ప్రకటించారు.
నటి అమలాపాల్‌కు గుడిలోకి నో ఎంట్రీ.. అదే కారణమన్న ఆలయ వర్గాలు - Amalapaul denied permission to enter Hindu temple
హీరోయిన్ అమలా పాల్‌ను గుడిలోకి రానివ్వకుండా అడ్డుకున్నారు ఆలయ నిర్వహకులు. నిబంధనల ప్రకారం క్రైస్తవులకు ఆలయంలోకి ప్రవేశం లేదన్నారు. దీంతో ఆమె చేసేదిలేక రోడ్డు దగ్గర నుంచే దేవుడిని మొక్కి వెళ్లిపోయారు. ఈ ఘటన కేరళలో జరిగింది.
![నటి అమలాపాల్‌కు గుడిలోకి నో ఎంట్రీ.. అదే కారణమన్న ఆలయ వర్గాలు Etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17510427-thumbnail-3x2-photo.jpg)
ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా గుడికి వచ్చిన అమలా పాల్‌ను.. లోపలికి రాకుండా అడ్డుకున్నారు నిర్వాహకులు. దీంతో ఆమె రోడ్డు దగ్గర నుంచే దేవుడికి ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రసాదాలు తీసుకుని తిరిగి వెళ్లిపోయారు. "ఆమె క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి అయినందునే గుడిలోకి అనుమతి నిరాకరించాం. ఆలయంలోకి హిందువులకు మాత్రమే అనుమతి ఉంటుంది. గతంలో ఉన్న నిబంధనలనే మేం పాటిస్తున్నాం" అని ఆలయ నిర్వాహకులు తెలిపారు.
ఆలయ నిర్వహకుల నిర్ణయాన్ని పలువులు విమర్శిస్తున్నారు. హిందూ ఐక్య వేదిక నాయకులు ఆర్వీ బాబు అమలాపాల్‌కు మద్దతిస్తూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. అమలాపాల్‌కు గుడిలోకి వచ్చేందుకు అనుమతి ఇవ్వకపోవడంపై ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తారు. హిందువులు కానివారిని ఆలయంలోకి అనుమతికి నిరాకరించడం వెనుక ఉద్దేశం ఏంటన్నారు. తిరుపతి వంటి దేవాలయాల్లో అనుసరించే ఆచారాలను ఆలయ నిర్వాహకులు పరిగణనలోకి తీసుకోవాలని ఆర్వీ బాబు సూచించారు.