దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 37,04,009కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వరుసగా రెండోరోజు క్రియాశీల కేసుల సంఖ్య తగ్గినట్లు పేర్కొంది. ఒక్కరోజులోనే 11,122 యాక్టివ్ కేసులు తగ్గినట్లు వివరించింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాలు..
- ఒక్కరోజులో కరోనా నుంచి కోలుకున్నవారు - 3,55,338
- దేశంలో కొత్తగా నమోదైన కేసులు - 3,48,421
- మరణాలు - 4,205
- దేశంలోని మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం - 15.87
- మొత్తం కోలుకున్నవారి సంఖ్య - 1,93,82,642
- జాతీయ మరణాల రేటు- 1.09 శాతం
- కేవలం 10 రాష్ట్రాల్లోనే 73.17 శాతం మరణాలు