భారత్లో కరోనా వైరస్ కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కొత్తగా 47,905 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 550 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 86,83,917కు చేరింది. మరణాల సంఖ్య 1,28,121గా ఉంది.
రెండో రోజూ 5 లక్షలకు దిగువన యాక్టివ్ కేసులు
దేశంలో మరో 47,905 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. 550 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 86.83 లక్షలకు చేరగా.. మృతుల సంఖ్య 1.28 లక్షలుగా ఉంది.
కేసులు
మరోవైపు రికవరీల సంఖ్య భారీగా పెరుగుతోంది. మంగళవారం 52,718 మంది డిశ్ఛార్జి అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 80,66,502కు పెరిగింది.
వరుసగా రెండో రోజు క్రియాశీల కేసుల సంఖ్య 5 లక్షలకు దిగువన నమోదైంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,89,294గా ఉంది.