దుష్ప్రచారాలు, హింసకు ప్రేరేపించే వార్తల విషయంలో సామాజిక మాధ్యమాలకు కేంద్ర హెచ్చరికలు జారీ చేసింది. ఆర్టికల్ 19ఏ ప్రకారం స్వేచ్ఛా హక్కు ఉన్నప్పటికీ.. దానికి సహేతుకమైన పరిమితులు ఉన్నాయని కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. సోషల్ మీడియా సంస్థలు భారత్లోని చట్టాలకు అనుగుణంగానే ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని రాజ్యసభ వేదికగా హెచ్చరించారు.
"సాధారణ పౌరులను చైతన్యపరుస్తున్న సామాజిక మాధ్యమాలను గౌరవిస్తాం. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో సామాజిక మాధ్యామాలది పాత్ర ఎనలేనిది. కానీ, తప్పుడు వార్తలను వ్యాప్తి చేసేందుకు, హింసను ప్రేరేపించేందుకు వీటిని ఉపయోగిస్తే చర్యలు తీసుకుంటాం. అది ట్విట్టర్ అయినా, ఎవరైనా."
-రవి శంకర్ ప్రసాద్, కేంద్ర ఐటీ శాఖ మంత్రి