ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్ డ్రీమ్ 11 ద్వారా రూ.కోటికి పైగా గెలుచుకున్న ఓ వ్యక్తి మద్యం సేవించి బీభత్సం సృష్టించాడు. అతడి వికృత చేష్టలను చూసి కంగారుపడిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో తాను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి బంధువునని చెప్తూ.. పోలీసులను బెదిరించడం ప్రారంభించాడు. శాంతి భద్రతలకు భంగం కలిగించినందుకు నిందితుడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
డ్రీమ్ 11లో రూ.కోటి జాక్పాట్.. ఫుల్లుగా మందుకొట్టి హల్చల్.. అఖరికి - ఉత్తరాఖండ్ లేటెస్ట్ న్యూస్
డ్రీమ్ 11 యాప్లో రూ.కోటికిపైగా గెలుచుకున్న ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి బీభత్సం సృష్టించాడు. అతడి వికృత చేష్టలను చూసి కంగారుపడిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ జరిగింది..
సిడ్కుల్ ప్రాంతానికి చెందిన మహేష్ సింగ్ ధామి అనే వ్యక్తి నవోదయనగర్లోని డిఫెన్స్ కాలనీలో నివసిస్తున్నాడు. అతడు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్ డ్రీమ్ 11 అనే యాప్లో రూ.కోటికిపైగా నగదును గెలుచుకున్నాడు. ఈ మొత్తంలో పన్నులు మినహాయించగా అతడి ఖాతాలోకి రూ.96 లక్షలు వచ్చాయి. డబ్బులు వచ్చిన ఆనందంలో మహేష్ ఫూటుగా మద్యం సేవించి తనకు నచ్చినట్లుగా ప్రవర్తించాడు. అతడిని ఆపేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయేసరికి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుంటుండగా తాను ముఖ్యమంత్రి సోదరుడినని అన్నాడు. అలాగే పోలీసులను యూనిఫాం విప్పమని బెదిరించాడు.