తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రేప్ కేసులో నాలుగున్నరేళ్లకు విముక్తి.. ప్రభుత్వం నుంచి రూ.10,000కోట్ల పరిహారం డిమాండ్ - మధ్యప్రదేశ్​ ప్రభుత్వం 10000 కోట్ల పరిహారం కేసు

గ్యాంగ్ ​రేప్​ కేసులో నిర్దోషిగా తేలిన వ్యక్తి.. ప్రభుత్వం నుంచి భారీ పరిహారం కోరుతూ కోర్టులో దావా వేశాడు. అతను కోరింది.. కోటి, 10 కోట్లు కాదు. ఏకంగా రూ.10,000 కోట్లకుపైనే..! ఈ వింత ఘటన మధ్యప్రదేశ్​ జరిగింది. ఈ కేసుకు సంబంధించి కోర్టు జనవరి 10న విచారణ చేపట్టనుంది.

man seeking 10000 cr in madhya pradesh government
కోర్టు పరిహారం కేసు

By

Published : Jan 4, 2023, 4:20 PM IST

మధ్యప్రదేశ్​లో గ్యాంగ్​ రేప్​ కేసులో నిర్దోషిగా తేలిన ఓ వ్యక్తి ప్రభుత్వం నుంచి భారీ పరిహారం కోరాడు. బాధ, మానసిక వేధన అనుభవించిన కారణంగా.. ప్రభుత్వం నుంచి పరిహారంగా రూ.10,006.02 కోట్లు కోరుతో కోర్టులో దావా వేశాడు. మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌కు చెందిన 35 ఏళ్ల కాంతిలాల్​ భీల్​ గ్యాంగ్​ రేప్​ కేసులో రెండేళ్ల పాటు జైలులో ఉన్నాడు. కోర్టు అతడ్ని నిర్దోషిగా ప్రకటించిన తర్వతా.. ఇంత మొత్తంలో పరిహారం కోరడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ కేసును రత్లామ్‌లోని స్థానిక సెషన్స్​ కోర్టు​ జనవరి 10న విచారించనుంది.

అసలేంటా కేసు..?
కాంతు అలియాస్​ కాంతిలాల్​ భీల్..​ రత్లామ్​ వాసి. 2018 జులై 20న ఓ మహిళ భీల్​ తనపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ మానస పోలీస్​స్టేషన్​లో కేసు నమోదు చేసింది. భీల్​ తనను తన సోదరుడి ఇంటి వద్ద దింపుతానని నమ్మించి.. అత్యాచారం చేశాడని ఆ మహిళ ఆరోపించింది. అనంతరం మరో వ్యక్తికి అప్పగించాడని.. అతను తనపై 6 నెలల పాటు అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులో తెలిపింది. ఈ కేసులో భీల్​ను పోలీసులు 2020 డిసెంబర్​ 23న అరెస్ట్​ చేశారు. భీల్ దాదాపుగా రెండేళ్ల పాటు​ జైలులో ఉన్నాడు. అయితే అవి తప్పుడు ఆరోపణలని తేల్చుతూ స్థానిక కోర్టు.. 2022 అక్టోబర్​ 20న భీల్​ను నిర్దోషిగా విడుదల చేసింది.

'మనిషి జీవితం ఎంతో విలువైంది. భీల్​ రెండేళ్ల పాటు తప్పుడు ఆరోపణలతో శిక్ష అనుభవించాడు. భీల్​ తల్లి, భార్య, ముగ్గురు పిల్లలు అతని సంపాదనతోనే బతుకుతున్నారు. భీల్​ అరెస్ట్.. అతని​ కుటుంబం మొత్తానికి ఆకలి బాధ, మానసిక వేదనను కలిగించింది. మనుషులకు దేవుడిచ్చిన బహుమతి జీవితం.. దాన్ని భీల్ రెండేళ్ల ​కోల్పోయాడు' అని భీల్ తరపు న్యాయవాది విజయ్​ సింగ్​ యాదవ్​ తెలిపారు. ఇందుకు రూ.10,006.02 కోట్లు పరిహారంగా కోరుతూ దావా వేశారు. ఇందులో రూ.10వేల కోట్లు 'మనిషి జీవితం ఎంతో విలువైనది' అనే వాదనతో డిమాండ్​ చేసినట్లు వివరించారు. న్యాయపరమైన ఖర్చుల కోసం రూ.2లక్షలతో కలిపి.. కుటుంబం పడిన బాధకు పరిహారం, ఇతర కారణాలతో మిగిలిన రూ.6.02కోట్లు అడుగుతున్నట్లు న్యాయవాది తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details