తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నాపై యాసిడ్ దాడి​ చేశారు.. దేవుడే కాపాడాడు: కేంద్ర మంత్రి - కేంద్ర మంత్రిపై యాసిడ్​ దాడి!

కేంద్ర మంత్రి పశుపతి కుమార్​ పారస్​ కీలక వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజుల కింద తనపై యాసిడ్​ దాడి జరిగిందని.. దేవుడి దయతో ప్రాణాలతో బయటపడ్డానని ఈటీవీ భారత్​తో చెప్పారు. తన ప్రజాదరణ చూసి ఓర్వలేకే దాడికి ఒడిగట్టారని ఆరోపించారు.

Acid was thrown on me in Hajipur: Union Minister Paras
కేంద్ర మంత్రిపై యాసిడ్​ దాడి!

By

Published : Aug 31, 2021, 11:02 AM IST

తనపై కొద్దిరోజుల కింద యాసిడ్​ దాడి జరిగిందని చెప్పారు కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి, ఎల్​జేపీ జాతీయ అధ్యక్షుడు పశుపతి కుమార్​ పారస్​. బిహార్​లోని హాజీపుర్​ సందర్శనలో ఉన్నప్పుడు.. కొందరు తనపై మండే స్వభావం ఉన్న రసాయనం విసిరారని ఈటీవీ భారత్​తో తెలిపారు. దేవుడి దయతో.. తనకేం కాలేదని, సంఘ విద్రోహ శక్తులే ఈ దాడికి దిగాయని ఆరోపించారు.

కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఆగస్టు 23న.. తన పార్లమెంటరీ నియోజకవర్గం హాజీపుర్​కు వెళ్లారు పారస్​. దివంగత నేత రామ్​ విలాస్​ పాసవాన్​తో సమానంగా తనకు అక్కడి ప్రజలు స్వాగతం పలికారని, ఈ నేపథ్యంలోనే తనపై దాడి జరిగిందని చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి.

కేంద్ర మంత్రి పశుపతి పారస్​

''నాకు దక్కుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే కొన్ని సంఘ విద్రోహ శక్తులు దాడి చేశాయి. ఆ ఘటనలో నా దుస్తులు కూడా కాలిపోయాయి.''

- పశుపతి కుమార్​ పారస్​, కేంద్ర మంత్రి​

పోలీసు వ్యవస్థ వైఫల్యమే.. ఈ ఘటనకు కారణమని అభిప్రాయపడ్డారు పారస్​. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

ఇప్పటికే తనకు అదనపు భద్రత కోసం కేంద్ర మంత్రి అమిత్​ షాను కలిశానని, బిహార్​ సీఎం నితీశ్​ కుమార్​తోనూ సంబంధిత విషయమై భేటీ అవుతానని చెప్పారు.

కేంద్ర మంత్రి పశుపతి పారస్​

ప్రస్తుతం పారస్​కు బిహార్​లో వై కేటగిరీ భద్రత ఉంది. అయితే.. జెడ్​ ప్లస్​ సెక్యూరిటీ కల్పించాలని 'షా'ను కోరారు.

ఇదీ చూడండి: Thirdwave of Corona: అక్టోబరు-నవంబరు మధ్య మూడోదశ ఉద్ధృతి!

ABOUT THE AUTHOR

...view details