Attack on Stray Dog: మూగజీవిని హింసించడమే కాక దాని మీద యాసిడ్ పోసి రాక్షసానందం పొందారు ఓ ఐదుగురు యువకులు. వారి వైఖరిని ప్రశ్నించిన ఓ మహిళను బెదిరించారు. ఈ అమానవీయ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం..
రోజూ రాత్రిళ్లు రోడ్లపైన తిరిగే నిందితులు.. వీధి కుక్కలను తంతూ హింసించేవారు. మార్చి 4న కూడా ఇదే విధంగా బానశంకరీలోని అంబేడ్కర్ నగర్ వద్ద తిరగడానికి వచ్చిన ఆ ఐదుగురు యువకులు.. వాళ్ల కంటపడ్డ ఓ వీధి కుక్కను హింసించారు. ఆ శునకాన్ని కట్టేసి దానిపై యాసిడ్, పెట్రోల్ పోశారు. ఇదంతా చూసిన ఓ 50 ఏళ్ల మహిళ వీరి వైఖరిపై ప్రశ్నించగా ఆమెను బెదిరించారు.