తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నెల రోజుల పసికందును హత్య చేసిన తల్లి - బావిలో పడ్డ చిన్నారి

కన్నబిడ్డ పట్ల ఓ తల్లి క్రూరంగా ప్రవర్తించింది. నవజాత శిశువు అని కూడా చూడకుండా బావిలో పడేసి హత్య చేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని బడ్​వానీ జిల్లాలో జరిగింది.

women killed baby
కన్నబిడ్డను బావిలో పడేసిన తల్లి!

By

Published : May 24, 2021, 12:47 PM IST

మధ్యప్రదేశ్​లో అమానవీయ ఘటన జరిగింది. తనకు కుమార్తె పుడుతుందనుకోగా.. కుమారుడు పుట్టాడని ఓ మహిళ నెలరోజులు పసికందును బావిలో పడేసింది. ఫలితంగా ఈ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బడ్​వానీ జిల్లా సంగ్వీ గ్రామంలో జరిగింది.

ఇంతకీ ఏం జరిగిందంటే..

సంగ్వీ గ్రామానికి చెందిన లలిత మహిళకు ఇది వరకే ముగ్గురు మగ పిల్లలు ఉన్నారు. నాలుగో కాన్పులో ఆమె తనకు అమ్మాయి పుడుతుందని భావించింది. కానీ, అలా జరగలేదు. దాంతో తన నెలరోజుల బాబును ఈ నెల 16న, ఉదయం నాలుగింటికి తమ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బావిలో పడేసిందని పోలీస్​ అధికారిణి సోను షితోలే తెలిపారు. అనంతరం.. పోలీసులను ఆమె తప్పు దోవ పట్టించిందని చెప్పారు.

నిందితురాలు లలిత
నిందితురాలిని అరెస్టు చేస్తున్న పోలీసులు

అయితే.. దర్యాప్తులో లలితే ఈ నేరం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆమెను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు.

ఇదీ చూడండి:కరోనాతో గర్భిణీ వైద్యురాలు మృతి

ABOUT THE AUTHOR

...view details