ముంబయిలోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయంలో బాంబు పెట్టామని నకిలీ ఈమెయిల్ పంపిన శైలేష్ షిండే అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుణెలోని ఘోర్పాడి ప్రాంతంలో అతన్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
కుమారుడికి అడ్మిషన్ ఇవ్వలేదని బాంబు బెదిరింపు! - మంత్రాలయ బాంబు కేసులో నిందితుడు అరెస్ట్
కుమారునికి పాఠశాలలో అడ్మిషన్ ఇవ్వలేదని ప్రభుత్వ ప్రధాన కార్యాలయానికి బెదిరింపు మెయిల్ పెట్టాడు ముంబయిలోని ఓ వ్యక్తి. అతన్ని పుణెలో పోలీసులు అరెస్ట్ చేశారు.
మంత్రాలయా బాంబు కేసు
తన కుమారుడిని పాఠశాలలో చేర్చుకోకపోవడం కారణంగా నకిలీ ఈ మెయిల్‌ను పంపినట్లు ఇన్స్పెక్టర్ కోలేకర్ తెలిపారు. అతనిపై ముంబయిలోని మెరైన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని తెలిపిన ఆయన.. అక్కడి పోలీసులకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. పదిహేను రోజుల్లో ఇలా బెదిరింపు ఈ మెయిల్ రావడం ఇది రెండోసారి అని అన్నారు.
ఇదీ చూడండి:దేవభూమిలో ఆలయాలపై రగడ