తెలంగాణ

telangana

ETV Bharat / bharat

TSPSC పేపర్‌ లీక్ కేసు సిట్‌కు బదిలీ.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు - TSPSC question paper case updates

TSPSC paper leak case టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో పోలీసులు అరెస్టు చేసిన 9మంది నిందితులకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. వాదనలు విన్న న్యాయమూర్తి 9 మంది నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించారు. మరోవైపు కేసును సిట్​కు బదిలీ చేస్తూ సీపీ ఆదేశించారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 14, 2023, 6:24 PM IST

Updated : Mar 14, 2023, 7:42 PM IST

TSPSC paper leak case: రాష్ట్రంలో ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారం చర్చనీయంశమైంది. ఈ కేసులో బేగంబజార్ పోలీసులు అరెస్టు చేసిన 9 మంది నిందితులకు ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా... వాదనలు విన్న న్యాయమూర్తి 9 మంది నిందితులకు 14 రోజుల రిమాండ్‌ విధించారు.

ఇక ఈ కేసు నిందితులను చంచల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు. ఈ వ్యవహారంలో నిందితుల రిమాండ్ రిపోర్టును పోలీసులు కోర్టుకు సమర్పించారు. అందులో కీలక విషయాలు ఉన్నాయి. ఏఈ, టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీస్‌ పరీక్ష పత్రాలను ప్రవీణ్‌ తన వద్దే ఉంచుకున్నట్లు రిమాండ్ రిపోర్ట్‌లో ఉంది. 24 పేజీల ఏఈ పరీక్ష పేపర్‌ నకళ్లు, 25 పేజీల టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీస్‌ పరీక్ష పత్రాల నకళ్లు ప్రవీణ్‌ నుంచి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులోని కీలక అంశాలు ఇలా.... ''ఈ నెల 11న టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి ఫిర్యాదు చేశారు. అడ్మిన్ విభాగ సహాయ కార్యదర్శి ఫిర్యాదు చేశారు. కంప్యూటర్ల నుంచి కీలక సమాచారం లీకైందని ఫిర్యాదు. అసిస్టెంట్ సెక్షన్ అధికారి ప్రవీణ్‌పై అనుమానం ఉందన్నారు. సెక్షన్ 409 ఐపీసీ, 66బీ అండ్ సీ, ఐటీ యాక్ట్ సెక్షన్లుతో కేసు నమోదు. బేగంబజార్ పోలీసులు కమిషన్‌లో ఆధారాలు సేకరించారు. ఈనెల 13న బడంగ్‌పేట్‌లో ప్రవీణ్‌ను అరెస్ట్ చేశారు. కార్యదర్శి పేషీ నుంచి ఐపీ అడ్రస్‌, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ దొంగతనం. ఐపీ అడ్రస్‌, యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ దొంగిలించినట్టు ప్రవీణ్‌ అంగీకారం. సిస్టమ్ అడ్మిన్‌ రాజశేఖర్ సాయంతో పేపర్లు కాపీ చేసుకున్న ప్రవీణ్‌. పెన్‌డ్రైవ్‌లో ప్రశ్నాపత్రాలు కాపీ చేసుకున్న ఏఎస్‌ఓ ప్రవీణ్‌. రేణుకకు పేపర్లను రూ.10 లక్షలకు అమ్మిన ప్రవీణ్‌. ప్రవీణ్ సహాయంతో మిగిలిన నిందితుల ఇళ్లపై దాడులు నిర్వహించాం. '' అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

ఇక నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించగా... ఏ3 రేణుకను చంచల్‌గూడ మహిళా జైలుకు పోలీసులు తరలించారు. నిందితులను 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని బేగంబజార్ పోలీసులు పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు నిర్ణయం ప్రకటించలేదు. ఇక ఈ కేసును నగర కమిషనర్ సీపీ సీవీ ఆనంద్ సిట్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ జరిగింది... ఈ నెల 12న నిర్వహించాల్సిన టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ పరీక్ష ప్రశ్నపత్రాలతో మరిన్ని పేపర్లు లీకయ్యాయన్న విషయాలు రాష్ట్రంలోని ఉద్యోగార్ధులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. 2017లో టీఎస్‌పీఎస్సీలో ప్రవీణ్ జూనియర్ అసిస్టెంట్‌గా చేరిన ప్రవీణ్‌.. నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్ సెక్షన్‌లో పనిచేశాడు. ఏడాది క్రితం పదోన్నతి లభించి టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడిగా వెళ్లిన ప్రవీణ్... ఉన్నతాధికారుల వద్ద ఎంతో క్రమశిక్షణతో మెలిగేవాడు. దీనినే ఆసరాగా తీసుకుని పేపర్ లీకేజీ తెరలేపాడని తెలుస్తోంది.

ఏఈ పరీక్షాపత్రం కూడా ఉపాధ్యాయిని రేణుక కారణంగానే లీక్ అయిందని తేల్చారు. టౌన్ ప్లానింగ్‌ పరీక్షతో పాటు వెటర్నరీ పేపర్‌లను కూడా ప్రవీణ్‌ సంపాదించాడు. పేపర్లు చేతికి వచ్చినా ఒప్పందం కుదరకపోవటంతో వీటిని ఎవరికీ అమ్మలేదు. కాగా... ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్‌ ఇటీవల జరిగిన గ్రూప్-వన్‌ ప్రిలిమ్స్ పరీక్ష రాశాడు.

ఇందులో ప్రవీణ్‌కు 103మార్కులు రావటాన్ని గమనిస్తే.... గ్రూప్ 1 ప్రిలిమ్స్‌ను కూడా లీక్‌ చేశాడా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. టీఎస్‌పీఎస్సీ అధికారులు.... ప్రవీణ్ ఓఎంఆర్‌ షీట్‌ను పరిశీలిస్తున్నారు. ప్రవీణ్‌కు గ్రూప్‌ వన్‌ ప్రిలిమ్స్‌లో 103 మార్కులు వచ్చినా.... అర్హత సాధించలేదు. 150కు 103 మార్కులు వచ్చే ప్రతిభ ప్రవీణ్‌కు ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్‌ వచ్చిన సర్వర్‌ను పరిశీలిస్తున్న సైబర్ నిపుణులు.... ఈ పేపర్ కూడా లీక్ అయిందా... లేదా.... అని విశ్లేషిస్తున్నారు.

ఇవీ చూడండి..

TSPSC పేపర్‌ లీకేజీ కేసు.. ప్రవీణ్‌ ఫోన్‌లో మహిళల న్యూడ్ వీడియోలు

TSPSC లీకేజీ వ్యవహారం.. AE పేపర్ ఒక్కటే కాదు.. అవి కూడా లీక్?

Last Updated : Mar 14, 2023, 7:42 PM IST

ABOUT THE AUTHOR

...view details