ఓ వ్యక్తి తన కుటుంబంలో ఐదుగురిని హత్య చేసి.. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్ర నాగ్‌పుర్ జిల్లాలోని పాచ్పాలి ప్రాంతంలో జరిగింది. ఆ వ్యక్తిని టిమ్కిగా గుర్తించారు పోలీసులు.
సొంత కుటుంబాన్ని కడతేర్చి.. చివరకు తానూ.. - క్రైమ్ న్యూస్
ఓ వ్యక్తి తన కుటుంబంలోని ఐదుగురిని దారుణంగా చంపి.. ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్రలో జరిగిందీ దారుణ ఘటన.
ఘటనా స్థలం వద్ద పోలీసులు
టిమ్‌కి.. తొలుత తన అత్తవారింటి వద్ద ఇద్దరిని చంపి, తర్వాత తన ఇంటి వద్ద ముగ్గురిని కిరాతకంగా హత్యచేశాడు. వారిలో అతని భార్య, కుమారుడు, కూమార్తె, మరదలు సహా మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అతడు ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. అయితే ఇందుకు కారణమేంటన్నది తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
ఇదీ చూడండి:రైలు నుంచి జారిపడ్డ మహిళ- క్షణాల్లోనే...