కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఆ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నా.. ఆసుపత్రిలో చేరాల్సినంత ఇబ్బంది దాదాపుగా ఉండదని తాజా అధ్యయనం చెబుతోంది. కేవలం 0.06 శాతం మందికే ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఉంటుందని దిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి తెలిపింది.
తొలి 100 రోజుల వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కొవిడ్ లక్షణాలతో రిపోర్ట్ చేసిన ఆరోగ్య సంరక్షణ సిబ్బందిపై ఈ ఆసుపత్రి అధ్యయనం నిర్వహించింది. 'వ్యాక్సినేషన్ తర్వాత ఇన్‌ఫెక్షన్' పేరుతో ఫలితాలను వెల్లడించింది.
"వ్యాక్సినేషన్ వంద శాతం కొవిడ్ నిరోధక శక్తిని ఇవ్వదని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే వ్యాధి సోకినా తీవ్ర ఇబ్బందులు తలెత్తకుండా రక్షిస్తుంది. వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో 97.38 శాతం కొవిడ్ ఇన్‌ఫెక్షన్ నుంచి రక్షణ పొందారు. కొవిడ్ సోకిన వారిలో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం 0.06 శాతం మందిలోనే కలిగింది"