తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెట్రో మంట: ఎడ్లబండిపై మండపానికి పెళ్లి బృందం - bullock cart marriage

వధూవరులు పెళ్లిమండపానికి హెలికాప్టర్​లో, ఖరీదైన కార్లలో రావటం ఇప్పుడు ట్రెండ్. కానీ ఓ వరుడు మాత్రం ఎడ్లబండిపై మండపానికి చేరుకుని ఆశ్చర్యపరిచాడు. వరుడితో పాటు పెళ్లి బృందం సభ్యులు మొత్తం ఎడ్లబండ్లు కట్టుకుని వచ్చారు. పెరుగుతున్నపెట్రోల్ ధరల దృష్ట్యా ఇలా చేశామని వరుడు చెప్పుకొచ్చాడు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్ దేవరియాలో జరిగింది.

bullock cart
ఎడ్లబండిపై పెళ్లి మండపానికి

By

Published : Jun 21, 2021, 11:45 AM IST

ఎడ్ల బండ్లతో పెళ్లి ఊరేగింపు

దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలు, వాయు కాలుష్యం దృష్ట్యా.. ఉత్తర్​ప్రదేశ్ దేవరియాకు చెందిన వరుడు ఛోటే లాల్.. ఎడ్ల బండిపై కళ్యాణ మండపానికి వచ్చాడు. అతనితో పాటు పెళ్లి బృందం కూడా ఎడ్ల బండ్లు కట్టుకుని మండపానికి రాగా.. రోడ్డు మార్గం అంతా సందడి నెలకొంది.

ఛోటే లాల్ గ్రామం కుషారీ నుంచి 35 కిలోమీటర్ల దూరంలోని పక్రీ బజార్​లో పెళ్లి మండపం ఉంది.

క్యూ కట్టిన ఎడ్లబండ్లు
ఎడ్లబండిపై వస్తున్న వరుడు

అందుకే ఇలా..

వరుడు ఛోటే లాల్

తనకు చిన్నప్పటి నుంచి ఎద్దుల బండిపై వచ్చి వివాహం చేసుకోవాలని ఉండేదని ఛోటే లాల్ తెలిపాడు. ఈ విధానం వల్ల సంస్కృతి, సంప్రదాయాన్ని పెంపొందించటం సహా వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నాడు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రతిఒక్కరూ ఖర్చులను తగ్గించుకోవాలని హితవు పలికాడు.

ఇదీ చదవండి :ఆదర్శ కుమారులు- తండ్రికి గుడి కట్టి పూజలు

ABOUT THE AUTHOR

...view details