తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్తంభాన్ని 'ఢీ' కొన్న బైక్- పెళ్లి కూతురు మృతి - కర్ణాటకలో రోడ్డు ప్రమాదం

కర్ణాటక రాయచూర్​లో ఓ పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లికార్డులు పంచి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లికూతురుతో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

Accident while returning from invitng for marriage:  Three died including bride
స్తంభాన్ని 'ఢీ' కొన్న ద్విచక్రవాహనం- పెళ్లి కూతురు మృతి

By

Published : Jan 19, 2021, 1:10 PM IST

మరో మూడు రోజుల్లో పెళ్లి చేసుకుని అత్తారింట్లో అడుగు పెట్టాల్సిన ఆ నవ వధువును మృత్యువు కాటేసింది. స్నేహితులకు పెళ్లి కార్డు ఇచ్చి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లికూతురుతో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన కర్ణాటక రాయచూర్​లో జరిగింది.

ఘటనా స్థలిలో మృతి చెందిన వీరేశ్​
ప్రమాదంలో మృతి చెందిన యువతులు

ఏం జరిగింది?

స్నేహితులకు పెళ్లి కార్డులు ఇచ్చి మస్కీ పట్టణం నుంచి లింగసుగుర్​కు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన్న ఉన్న స్తంభాన్ని ఢీ కొంది. ఈ ఘటనలో పెళ్లి కూతురు రజియా బేగం​తో పాటు, మరో యువతి అరుణాక్షి, బైక్​ నడుపుతున్న వీరేశ్​లు అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే ఘటనా స్థిలికి చేరుకున్న మస్కీ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి :కూలీలపైకి దూసుకెళ్లిన ట్రక్కు-15 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details