హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న ఓ టెంపో అదుపు తప్పి వాగులో పడింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 10మంది గాయపడ్డారు. క్షతగాత్రులను కులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు సహా ఏడుగురు దుర్మరణం - హిమాచల్ ప్రదేశ్ లేటెస్ట న్యూస్
పర్యాటకులతో వెళ్తున్న ఓ టెంపో అదుపు తప్పి వాగులో పడింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 10మంది గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదం హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో అర్ధరాత్రి జరిగింది.
![ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు సహా ఏడుగురు దుర్మరణం accident in kullu today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16473474-thumbnail-3x2-car.jpg)
accident in kullu today
ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. బాధితులంతా హరియాణా, దిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లకు చెందిన వారని అధికారులు వెల్లడించారు. మృతులను దిల్లీకి చెందిన సౌరభ్, ప్రియాంక గుప్తా, కిరణ్.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రిషభ్ రాజ్, అన్షిక జైన్, ఆదిత్యగా గుర్తించారు.
Last Updated : Sep 26, 2022, 5:35 PM IST