Accident In Karnataka: బెంగళూరులోని హోసకోట్ మండలం అత్తూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు జాతీయ రహదారి 75పై డివైడర్ పైనుంచి పల్టీ కొట్టి లారీని ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.
మృతిచెందిన విద్యార్థులను వైష్ణవి, భరత్, సిరిల్, వెంకట్‌గా గుర్తించారు పోలీసులు. వీరంతా గార్డెన్ సిటీ కాలేజీలో చదువుతున్నట్లు తెలిపారు. విద్యార్థులంతా సరదాగా బయట తిరిగేందుకు వచ్చినట్లు సీపీ మంజునాథ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
Accident In Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్‌ను ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మహిళలు మృతిచెందారు. డ్రైవర్ సహా ఐదుగురు గాయపడ్డారు. బుధవారం ఉదయం అభన్పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేంద్రీ గ్రామం వద్ద జాతీయ రహదారి (ఎన్-30)పై ఈ ఘటన జరిగింది.