కర్ణాటక, యాదగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
సమీప గ్రామంలో కూలీ కోసం ఆటోలో వెళుతుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు.