ACB Raids at Marriguda MRO House :నల్గొండ జిల్లామర్రిగూడ తహసీల్దార్ (Marriguda MRO Mahendar Reddy) మహేందర్‌రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు ముగిశాయి. ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఈ తెల్లవారుజాము నంచి సాయంత్రం వరకు హైదరాబాద్ హస్తినాపురంలోని మహేందర్‌రెడ్డి నివాసంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే భారీగా నగదు, బంగారు, ఇతర ఆస్తులను గుర్తించారు.
TU VC Ravinder Caught by ACB Officials : ఏసీబీకి చిక్కిన తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్
ACB Raids in MRO Mahendar Reddy :ట్రంక్ పెట్టెలో భారీగా దాచి పెట్టిన నగదును ఏసీబీ అధికారులు (ACB Officears) గుర్తించారు. ఆ ట్రంక్ పెట్టెను వెల్డర్ సాయంతో తెరిచారు. కౌంటింగ్ మిషన్ సాయంతో నగదు లెక్కించగా.. రూ.2 కోట్లుగా తేలింది. గతంలో కందుకూరులోనూ తహసీల్దార్‌గా పని చేసిన మహేందర్ రెడ్డిపై.. అనిశాకు ఫిర్యాదులు రావడంతో దృష్టి పెట్టారు. ఆయన ఇంట్లో పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలను గుర్తించారు. మహేందర్‌రెడ్డి ఇంటితో పాటు.. వారి కుటుంబ సభ్యులు, సమీప బంధువుల ఇళ్లల్లోనూ అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మరోవైపు మహేందర్‌రెడ్డి విధులు నిర్వహిస్తున్న మర్రిగూడ ఎమ్మార్వో కార్యాలయంలోనూ అధికారులు సోదాలు చేశారు.
మహేందర్‌రెడ్డి, కుటుంబీకుల పేరిట భారీగా స్థిర, చరాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. తహసీల్దార్‌కు సంబంధించి మొత్తం రూ.4.75 కోట్ల అక్రమ ఆస్తులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తహసీల్దార్ మహేందర్‌రెడ్డిని అరెస్ట్ చేసి.. అనిశా కోర్టులో అధికారులు హాజరుపరిచారు.