కర్ణాటకలో అవినీతి ప్రభుత్వ ఉద్యోగులకు షాకిస్తూ అనూహ్య దాడులు చేశారు ఏసీబీ అధికారులు. ఒకేసారి 60 చోట్ల విస్తృత సోదాలు నిర్వహించారు. భారీ మొత్తంలో అక్రమ బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు(ACB Raid in Karnataka).
సోదాల్లో భాగంగా కలబురగి పీడబ్ల్యూడీ జేఈ శాంతగౌడ ఇంట్లో తనిఖీ కోసం వెళ్లారు ఏసీబీ సిబ్బంది. అతని ఇంటి డ్రైనేజీ పైపులో నోట్ల కట్టలు ఉన్నట్లు గుర్తించారు. ప్లంబర్‌ను పిలిపించి పైపు కట్ చేసి వాటిని బయటకు తీశారు. ఏసీబీ అధికారులను చూసి శాంతగౌడ తలుపులు 10 నిమిషాల పాటు తెరవలేదు(karnataka acb raid news). ఆ సమయంలోనే అతను డబ్బును డ్రైనేజీ పైపులో వేసి ఉంటాడని అధికారులు చెప్పారు. ఈ విషయం తెలిసే తాము పైపు కత్తిరించినట్లు వివరించారు. డ్రైనేజీ పైపు నుంచి రూ.13 లక్షలు వెలికితీసినట్లు వెల్లడించారు. శాంతగౌడ ఇంట్లో మొత్తం రూ.54లక్షల అక్రమ నగదు, బంగారు ఆభరణాలను అధికారులు సీజ్ చేశారు. రెండు లాకర్ల తాళంచెవులు ఇవ్వకుండా అధికారులను శాంతగౌడ ఇబ్బందిపెట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి(karnataka acb raids).