తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జవాన్ల కోసం 'ఏసీ జాకెట్లు'.. 70 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ కూల్​గా... - డీఆర్​డీఓ

AC jackets for Indian soldiers: జవాను జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో, ప్రతికూల వాతావరణంలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అలాంటి జవానుకు అత్యాధునిక సదుపాయాలు అందించేందుకు శాస్త్రవేత్తలు నిత్యం కృషి చేస్తుంటారు. భానుడి భగభగల నుంచి రక్షించుకునేందుకు, శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు కావాల్సిన ఓ "జాకెట్​"ను రూపొందించారు. కర్ణాటక మైసూర్​లో జరిగిన ఓ ఎగ్జిబిషన్​లో ప్రదర్శనకు ఉంచారు. ఆ జాకెట్​ విశేషాలు..

AC jackets for Indian soldiers
జవాన్ల కోసం 'ఏసీ జాకెట్లు'.. 70 డిగ్రీల ఉష్ణోగ్రతల్లోనూ..!

By

Published : Dec 14, 2021, 5:26 PM IST

AC jackets for Indian soldiers: ఆజాదీకా అమృత్​ మహోత్సవ్​ను పురస్కరించుకుని.. కర్ణాటక మైసూర్​లో ఓ ఎగ్జిబిషన్​ను ఏర్పాటు చేశారు. ఇందులో 'ఏసీ జాకెట్​' ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 60-70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లోనూ జవాన్లు 'కూల్​'గా పనిచేసేందుకు వీలుగా ఈ ఏసీ జాకెట్​ను రూపొందించారు.

ఏసీ జాకెట్​
జాకెట్​ కింది భాగం

"ఈ జాకెట్లను యుద్ధ ట్యాంకర్లు, జలాంతర్గాముల్లో వినియోగించుకోవచ్చు. 60-70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండే రాజస్థాన్​ ఎడారుల్లో జవాన్లు ఈ జాకెట్లను వేసుకుంటే శరీరం చల్లగా ఉంటుంది. ఇవి వారికి గిఫ్ట్​ లాంటివి. జాకెట్లోని ఓ భాగంలో చల్లని నీరు ప్రవహిస్తుంది. శరీరంలోని వేడిని బయటకు తొసేస్తుంది. ఇందులో ఏర్పాటు చేసిన వ్యవస్థ చాలా సింపుల్​గా ఉంటుంది. విదేశాల్లో దీని ధర రూ. 25లక్షల వరకు ఉంటుంది. మేము రూ. 1.5లక్షల్లోనే దీనిని తయారు చేసేశాము. ఆత్మనిర్భర్​ భారత్​లో ఇదొక ముందడుగు. దీని వల్ల సైడ్​ ఎఫెక్ట్​లు కూడా ఉండవు."

--- రివయ్య, శాస్త్రవేత్త.

ఈ ఏసీ జాకెట్లను ఇప్పటికే జలాంతర్గాముల్లో వినియోగిస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మైసూరులో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్​

ఈ ఎగ్జిబిషన్​లో డీఆర్​డీఓ(డిఫెన్స్​ రీసెర్చ్​ అండ్​ డెవెలప్​మెంట్​ ఆర్గనైజేషన్​), డీఆర్​ఎఫ్​ఎల్​(డిఫెన్స్​ ఫుడ్​ రిసెర్చ్​ లెబొరేటరీ), డీఈబీఈఎల్​(డిఫెన్స్​ బయో-ఇంజినీరింగ్​ అండ్​ ఎలక్ట్రో మెడికల్​ లెబొరేటరీ) తయారు చేసిన పరికరాలను కూడా ప్రదర్శించారు.

గగన్​యాన్​ వ్యోమగాముల కోసం 'ఫుడ్​'..

ఎగ్జిబిషన్​లో పాల్గొన్న డీఆర్​ఎఫ్​ఎల్​.. గగన్​యాన్​ వ్యోమగాముల కోసం ఆహార పదార్థాలను సిద్ధం చేస్తోంది. ఇటీవలే ఓ జాబితాను కూడా రూపొందించింది.

"భూమి మీద అయితే కూర్చుని, నిల్చుని మనం భోజనం చేసేందుకు వీలు ఉంటుంది. కానీ అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు. అక్కడ మన చపాతీలు, కూరలు అన్నీ గాలిలో తేలుతూ ఉంటాయి. అందువల్ల వ్యోమగాములకు ప్రత్యేక ఆహారం రూపొందించాల్సి ఉంటుంది. దానిపై మేము పనిచేస్తున్నాము. ఆహారపదార్థాల జాబితాను సిద్ధం చేసి.. వాటిని పరీక్షిస్తున్నాము. గగన్​యాన్​లో రోదసిలోకి వెళుతున్న ముగ్గురు వ్యోమగాములు భారతీయులే. అందువల్ల భారతీయ వంటకాలనే ఎంపిక చేశాము. రెడీ టు ఈట్​ వంటకాలను కూడా సిద్ధం చేస్తున్నాము," అని ఆ సంస్థకు చెందిన శాస్త్రవేత్త మధుకర్​ ఈటీవీ భారత్​కు వెల్లడించారు.

గగన్‌యాన్ యాత్ర 2022 చివరినాటికి లేదా 2023 ప్రారంభంలో.. జరుగుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవలే తెలిపారు. గగన్​యాన్​కు ఎంపిక చేసిన అభ్యర్థులకు శిక్షణ కోసం రష్యాలోని గ్లావ్కోస్మోస్​ సర్వీస్ ప్రొవైడర్​తో 2019 జూన్​లో ఇస్రో ఒప్పందం చేసుకుంది. భారతీయ వాయుసేనకు చెందిన పైలట్లను ఇందుకోసం రష్యాకు పంపించింది. 2020 ఫిబ్రవరి 10న శిక్షణ ప్రారంభం కాగా.. కరోనా కారణంగా ట్రైనింగ్​కు మధ్యలో తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. ఈ ఏడాది మార్చ్​లో శిక్షణ ముగించుకుని వారు స్వదేశానికి తిరిగొచ్చారు.

ఇదీ చూడండి:-స్పేస్​లో చికెన్ బిర్యానీ, సాంబార్​ రైస్- 'గగన్​యాన్'​ కోసం మీల్స్​ రెడీ!

ABOUT THE AUTHOR

...view details