తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దక్షిణ భారతంలో ఈసారి వేసవి వేడి తక్కువే! - భారత వాతావరణ శాఖ

2021 వేసవి సీజన్​( మార్చి-మే)లో సాధారణం కంటే ఈసారి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. ఉత్తర, ఈశాన్య ప్రాంతాల్లో భానుడి ప్రతాపం అధికంగా ఉండనుందని పేర్కొంది. అయితే దక్షిణ భారత్​, మధ్య భారత్​లో మాత్రం సాధారణం కన్నా తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని వివరించింది.

Above normal summer temperatures likely across country except South, central India: IMD
'వేసవి సీజన్- ఆ ప్రాంతాల్లో భానుడి ప్రతాపం అధికం'

By

Published : Mar 1, 2021, 4:56 PM IST

వేసవి సీజన్​(మార్చి-మే)లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. ఉత్తర భారతం​, ఈశాన్య భారతంలో ఎండలు అధికంగా ఉండనున్నాయని తెలిపింది. తూర్పు, పశ్చిమ భారత్​లోని కొన్ని ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని పేర్కొంది.

దక్షిణ భారత్​, మధ్య భారత్​లో మాత్రం ఈ వేసవి సీజన్​లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

ఇదీ చదవండి :పర్యావరణహిత పురోభివృద్ధితోనే భవిత

ABOUT THE AUTHOR

...view details