కొవిడ్ టీకాపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం 18-19 సంస్థలు వ్యాక్సిన్లు రూపొందిస్తున్నాయని, ప్రయోగ దశలో ఉన్న ఈ టీకాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. మరో 2-3 వారాల్లో 50 ఏళ్లు పైడిన వారికి టీకా పంపిణీ చేపడతామని చెప్పారు.
"ప్రజలు కరోనా మార్గదర్శకాలను పాటించడం చాలా ముఖ్యం. అసలు టీకాతో పాటు ఈ సోషల్ వ్యాక్సిన్ కూడా అందరికీ అవసరం.
గత ఏడు రోజుల్లో 188 జిల్లాల్లో ఒక్క ప్రాంతంలోనూ కొవిడ్ కేసులు నమోదు కాలేదు. అదే విధంగా మూడు వారాల్లో 21 జిల్లాల్లో ఎక్కడా కరోనా కేసులు నమోదు కాలేదు. మరో 20-25 దేశాలకు భారత్ టీకాలను అందిస్తుంది."