తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కౌన్సిలర్​ దారుణ హత్య.. జిమ్​ చేస్తుండగానే ఒక్కసారిగా.. - ఆప్​ కౌన్సిలర్​ మర్డర్​

Councillor Shot Dead: పంజాబ్​లో మరోసారి దుండగులు రెచ్చిపోయారు. ఆమ్​ఆద్మీ పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్​ను జిమ్​లో కాల్చి చంపారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ​

AAP municipal councillor shot dead in Punjab's Malerkotla
AAP municipal councillor shot dead in Punjab's Malerkotla

By

Published : Jul 31, 2022, 1:23 PM IST

Councillor Shot Dead: పంజాబ్​లో మరో హత్య కలకలం రేపింది. ఆమ్​ఆద్మీ పార్టీకి చెందిన మున్సిపల్​ కౌన్సిలర్​ను పట్టపగలే దారుణంగా చంపారు ఇద్దరు దుండగులు. ఈ ఘటన మాలేర్​కోట్లా జిల్లాలో ఆదివారం ఉదయం జరిగింది. 18వ వార్డు కౌన్సిలర్​ మహ్మద్​ అక్బర్​ను జిమ్​లో వ్యాయామం చేస్తుండగానే.. దుండగులు అతి దగ్గరి నుంచి కాల్చినట్లు పోలీసులు తెలిపారు. సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.

కౌన్సిలర్​ అక్బర్​
మూడేళ్ల క్రితం అక్బర్​ సోదరుడు.. అన్వర్​ కూడా హత్యకు గురయ్యారు. ఆయన కూడా ఆ సమయంలో కౌన్సిలర్​గా ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో.. హత్యకు శత్రుత్వమే కారణమా? మరేదన్నా ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఎస్​ఎస్​పీ అవ్​నీత్​ కౌర్​ సిద్ధూ.

ABOUT THE AUTHOR

...view details