దిల్లీలోని ఎయిమ్స్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడిచేసిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి ఊరట లభించింది. ట్రయల్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను సస్పెండ్ చేస్తూ హైకోర్టు బుధవారం తీర్పును వెల్లడించింది. ట్రయల్ కోర్టు తీర్పును సోమ్నాథ్ సవాల్ చేయడంపై స్పందన తెలియజేయాలని దిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మే 20కి వాయిదా వేసింది.
ఆప్ ఎమ్మెల్యే సోమ్నాథ్ భారతికి ఊరట
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమ్నాథ్ భారతికి ట్రయల్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను దిల్లీ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఎయిమ్స్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడిచేసిన కేసులో సోమ్నాథ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఆప్ ఎమ్మెల్యే సోమ్నాథ్ భారతికి ఊరట
సోమ్నాథ్ భారతికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. ఇదే కేసులో అంతకు ముందు.. మెట్రోపాలిటన్ కోర్టు సోమ్నాథ్కు రూ. లక్ష జరిమానా విధించింది.
ఇదీ చదవండి :అభ్యర్థులకు కరోనా.. పార్టీల ప్రచారంపై తీవ్ర ప్రభావం