తెలంగాణ

telangana

ETV Bharat / bharat

AAICLAS Assistant Security Jobs : ఇంటర్​ అర్హతతో.. AAICLASలో 436 అసిస్టెంట్ సెక్యూరిటీ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా! - సెక్యూరిటీ ఉద్యోగాలు 2023

AAICLAS Assistant Security Jobs In Telugu : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్​. ఏఏఐ కార్గో లాజిస్టిక్స్​ అండ్​ అలైడ్​ సర్వీసెస్​ కంపెనీ (CLAS) 436 అసిస్టెంట్​ (సెక్యూరిటీ) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఈ పోస్టులకు కావాల్సిన విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

inter jobs 2023
AAICLAS Assistant Security Jobs 2023

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2023, 10:41 AM IST

AAICLAS Assistant Security Jobs : ఇంటర్ చదివి సరైన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. దిల్లీలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్​ అండ్​ అలైడ్​ సర్వీసెస్​ కంపెనీ (CLAS) 436 అసిస్టెంట్​ (సెక్యూరిటీ) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 3 ఏళ్ల ఫిక్స్​డ్​ టర్మ్​ కాంట్రాక్ట్​ ప్రాతిపదికను ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఏఏఐసీఎల్​ఏఎస్​ కేంద్రాల్లో.. ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు
అసిస్టెంట్​ (సెక్యూరిటీ) - 436 పోస్టులు

విద్యార్హతలు
AAICLAS Assistant Security Job Qualification :అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి 60 శాతం మార్కులతో 10+2 (ఇంటర్​) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఇంగ్లీష్​, హిందీ, స్థానిక భాషల్లో మాట్లాడే సామర్థ్యం కలిగి ఉండాలి.

వయోపరిమితి
AAICLAS Assistant Security Job Age Limit :అభ్యర్థుల వయస్సు 2023 అక్టోబర్ 1 నాటికి 27 ఏళ్లు మించి ఉండకూడదు.

దరఖాస్తు రుసుము
AAICLAS Assistant Fees :

  • జనరల్​, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్​ ఫీజుగా రూ.500 చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్​, మహిళా అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక ప్రక్రియ
AAICLAS Assistant Selection Process :అభ్యర్థులకు ముందుగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై అయిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి, అసిస్టెంట్ సెక్యూరిటీ పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
AAICLAS Assistant Salary :అభ్యర్థులకు నెలకు రూ.21,500 నుంచి రూ.22,500 వరకు జీతం అందిస్తారు.

పోస్టింగ్ ఏరియా :
AAICLAS Assistant Job Posting Area :తిరుపతి, వైజాగ్, గోవా, చెన్నై, భువనేశ్వర్​, కోల్​కతా, కోజికోడ్​, వారణాసి, శ్రీనగర్, వడోదర, మధురై, తిరుచ్చి, రాయ్​పుర్​, రాంచీ, పోర్ట్​ బ్లెయిర్​, అగర్తల, గ్వాలియర్​, అమృత్​సర్​, లేహ్​, దేహ్రాదూన్​, పుణె, ఇందౌర్​, సూరత్

దరఖాస్తు విధానం
AAICLAS Assistant Online Application Process :

  • ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా http://www.aaiclas.aero/ వెబ్​సైట్​ను ఓపెన్ చేయాలి.
  • AIACLAS Assistant (Security) నోటిఫికేషన్ లింక్​ను ఓపెన్ చేయాలి.
  • దరఖాస్తు ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
  • దరఖాస్తు రుసుమును ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
  • మరోసారి దరఖాస్తులోని అన్ని వివరాలు సరిచూసుకొని, అప్లికేషన్​ సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు
AAICLAS Assistant Important Dates :

  • ఆన్​లైన్​ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 2023 అక్టోబర్ 20
  • ఆన్​లైన్​ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 నవంబర్​ 15

IOCL Jobs 2023 : ఐటీఐ, డిగ్రీ అర్హతతో.. IOCLలో 1720 అప్రెంటీస్​ జాబ్స్​.. అప్లై చేసుకోండిలా!

Assam Rifles Recruitment 2023 : డిగ్రీ, డిప్లొమా అర్హతతో.. అసోం రైఫిల్స్‌లో 161 టెక్నికల్​, ట్రేడ్స్​మెన్ పోస్టులు.. మహిళలూ అర్హులే!

ABOUT THE AUTHOR

...view details